Flipkart New Year Sale : ఇది కదా డిస్కౌంట్.. భారీగా తగ్గిన రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్, ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?

Flipkart New Year Sale : రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఎంత తగ్గిందంటే?

Flipkart New Year Sale : ఇది కదా డిస్కౌంట్.. భారీగా తగ్గిన రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్, ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?

Redmi Note 14 Pro Plus (Image Credit to Original Source)

Updated On : January 1, 2026 / 3:42 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ధర రూ.21,878కి తగ్గింపు
  • 6.67-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ 120Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3, ట్రిపుల్ కెమెరాలు
  • రూ. 910 నెల నుంచి నో-కాస్ట్ ఈఎంఐ, రూ.21,350 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్

Flipkart New Year Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో న్యూ ఇయర్ సేల్ నడుస్తోంది. రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్, రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 5వేల కన్నా ఎక్కువ ఫ్లాట్ డిస్కౌంట్‌ అందిస్తోంది.

ఆసక్తిగల వినియోగదారులు బ్యాంక్ ఆఫర్లతో (Flipkart New Year Sale) మరింత ఆదా చేసుకోవచ్చు. ఈ రెడ్‌మి ఫోన్ 6.67-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్, IP66 + IP68 + IP69 కూడా అందిస్తుంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంతంటే? :
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ లాంచ్ ధర రూ.30,999 నుంచి రూ.25,878కి తగ్గింది. ఆసక్తిగల కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.4వేలతో (5శాతం) క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. తద్వారా ధర రూ.21,878కి తగ్గుతుంది. అంతేకాకుండా, కొనుగోలుదారులు నెలకు రూ.910 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు.

Redmi Note 14 Pro Plus

Redmi Note 14 Pro Plus (Image Credit to Original Source)

Read Also : Ration Card 2026 : జనవరి 1 నుంచి ఈ వ్యక్తులకు రేషన్ బంద్! మీరు కూడా ఉన్నారా? ఈరోజే ఇలా చేయండి

మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. రూ. 21,350 వరకు వాల్యూను పొందవచ్చు. ఫోన్ వాల్యూ, వర్కింగ్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. ఇంకా ఎక్కువగా చెల్లించారంటే ఎక్స్ టెండెడ్ వారంటీ కూడా పొందవచ్చు.

రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ఫోన్ 6.67-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్ కూడా అందిస్తుంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కంపెనీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కూడా చేర్చింది. హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ద్వారా పవర్ పొందుతుంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజీని కలిగి ఉంది.

బ్యాటరీ విషయానికొస్తే.. ఈ రెడ్‌మి నోట్ 6,200mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఛార్జింగ్‌ అందిస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్, 50MP టెలిఫోటో కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ అందిస్తుంది. సెల్ఫీ ప్రియుల కోసం 20MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.