Best Selfie Camera Phones
Best Selfie Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీ బడ్జెట్ ధరలోనే అద్భుతమైన సెల్ఫీ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ జూన్ 2025లో రూ. 15వేల లోపు ఉన్న (Best Selfie Camera Phones) అనేక ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఆకర్షణీయమైన ఫ్రంట్ కెమెరాలతో సెల్ఫీలు అద్భుతంగా వస్తాయి. సాధారణ కంటెంట్‌ను క్రియేట్ చేయడంతో పాటు వీడియో కాల్స్ తీసుకోవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు సరసమైన ధరలో ఈ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్లను సొంతం చేసుకోవచ్చు.
Read Also : MacBook Air M1 : మ్యాక్‌బుక్ ఎయిర్ M1పై బిగ్ డిస్కౌంట్.. కేవలం రూ. 58,990కే.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?
రెడ్‌మి 14C ధర రూ. 9,499 :
రెడ్‌మి 14C ఫోన్ 6.88-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. పవర్‌ఫుల్ విజువల్స్ అందిస్తుంది. మీడియాటెక్ హెలియో G81 అల్ట్రా చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఫొటోల వారీగా ఈ ఫోన్ 50MP మెయిన్ సెన్సార్, 50MP వైడ్-యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 13MP ఫ్రంట్ కెమెరాతో కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ ఆప్షన్.
శాంసంగ్ గెలాక్సీ M16 ధర రూ. 11,499 :
శాంసంగ్ గెలాక్సీ M16 ఫోన్ 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ ప్యానెల్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. కెమెరా వారీగా 50MP ప్రైమరీ సెన్సార్, 5MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఫొటోలకు 13MP సెల్ఫీ కెమెరాతో మంచి లైటింగ్ అందిస్తుంది.
వివో T4x రూ. 13,999 :
ఈ స్మార్ట్‌ఫోన్ (Best Selfie Camera Phones) 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మల్టీ టాస్కింగ్ అద్భుతంగా ఉంటుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP మెయిన్ కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా 8MP అయినప్పటికీ, సెల్ఫీల కోసం క్లియర్ షాట్స్ అందిస్తుంది. ఏఐ అప్‌గ్రేడ్స్, బ్యూటీ మోడ్‌లను కలిగి ఉంది. సోషల్ మీడియా పోస్టులకు సరైనది.
ఐక్యూ Z10x ధర రూ. 13,846 :
ఐక్యూ Z10x ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌తో వస్తుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. కెమెరా సెక్షన్‌లో ఐక్యూ ఫోన్ 50MP బ్యాక్ షూటర్ కలిగి ఉంది. సెల్ఫీ ఫ్రంట్ సైడ్ 8MP వైడ్-యాంగిల్ ఫ్రంట్ లెన్స్ గ్రూప్ సెల్ఫీలు, సోలో షాట్స్ కలిగి ఉంది.
పోకో M7 ప్రో ధర రూ. 12,999 :
పోకో M7 ప్రో సెల్ఫీ పర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. 20MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్ కూడా ఉన్నాయి. ఫోటోల వారీగా 50MP బ్యాక్ కెమెరా ఫొటోగ్రఫీని అందిస్తుంది.