Father’s Day 2025 : హ్యాపీ ఫాదర్స్ డే.. మీ నాన్నకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ కోసం రూ. 10వేల లోపు టాప్ 5 బెస్ట్ గాడ్జెట్లు ఇవే..!

​Father's Day 2025 : ఫాదర్స్ డే రోజున మీ తండ్రికి ఏదైనా సర్ ప్రైజ్ టెక్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా? రూ. 10వేల లోపు 5 బెస్ట్ గాడ్జెట్‌లు మీకోసమే..

Father’s Day 2025 : హ్యాపీ ఫాదర్స్ డే.. మీ నాన్నకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ కోసం రూ. 10వేల లోపు టాప్ 5 బెస్ట్ గాడ్జెట్లు ఇవే..!

Father's Day 2025

Updated On : June 8, 2025 / 3:25 PM IST

​Father’s Day 2025 : ఒక కుటుంబంలో తండ్రి తమ భార్యాపిల్లల కోసం ఎంతో కష్టపడతాడు. ఆ తండ్రి త్యాగాలను గుర్తించే రోజే ఫాదర్స్ డే. ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూన్ 15న వస్తుంది. ఈ రోజును వివిధ రకాల హావభావాలతో జరుపుకుంటారు. ఉదాహరణకు.. కొందరు తమ తండ్రికి బహుమతులు ఇచ్చేందుకు ఇష్టపడతారు. మరికొందరు తమ తండ్రితో కలిసి రోజుంతా సరదా గడిపేందుకు ఇష్టపడతారు.

జూన్ 15న ఫాదర్స్ డే :
చాలా దేశాలు జూన్‌లో ఫాదర్స్ డే జరుపుకుంటాయి. ఈ సంవత్సరం భారత్‌లో జూన్ 15న వస్తుంది. అయితే, క్రొయేషియా, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ వంటి దేశాలలో మార్చి 19న ఫాదర్స్ డే జరుపుకుంటారు. థాయిలాండ్‌లో, మాజీ రాజు భూమిబోల్ అదుల్యదేజ్ పుట్టినరోజు నాడు డిసెంబర్ 5న ఫాదర్స్ డే వేడుకలు జరుగుతాయి. ఆగస్టు 8న తైవాన్ లో ఫాదర్స్ డే జరుపుకుంటారు.

ఫాదర్స్ డే రోజున మీ తండ్రికి ఏదైనా సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా? ఒకవేళ మీ నాన్న ఎక్కువగా స్మార్ట్, స్టైలిష్ గాడ్జెట్లను ఇష్టపడేవారు (​Father’s Day 2025) అయితే అద్భుతమైన  గాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. టెక్-ఫ్రెండ్లీ గిఫ్ట్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. స్మార్ట్‌వాచ్‌ల నుంచి వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ల వరకు కేవలం రూ. 10వేల లోపు ధరలో 5 టాప్ గాడ్జెట్లను కొనేసుకోవచ్చు.

Read Also : Apple WWDC 2025 : ఆపిల్ బిగ్ ఈవెంట్.. కీనోట్ ఎప్పుడు? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి? ఏయే కొత్త అప్‌డేట్స్ ఉండొచ్చంటే?

ఫిలిప్స్ ఇండియా నంబర్ 1  ట్రిమ్మర్ (రూ. 4,899) :
భారత మార్కెట్లో ఫిలిప్స్ MG9551/65 నంబర్ 1 ట్రిమ్మర్, అడ్వాన్స్ ప్రో బియర్డ్‌సెన్స్ టెక్నాలజీతో వస్తుంది. ఈ 15-ఇన్-1 గ్రూమింగ్ కిట్ ఫేస్, బాడీ, ప్రైవేట్ పార్టులకు సరైనది. ప్రీమియం ఆల్-మెటల్ బాడీ, 120 నిమిషాల రన్‌టైమ్, 5 నిమిషాల క్విక్ ఛార్జ్‌ను కలిగి ఉంది. లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్, 3 ఏళ్ల వారంటీతో వస్తుంది.

సోనీ WH-CH720N (రూ. 9,725) :
సోనీ WH-CH720N డివైజ్ (​Father’s Day 2025) అనేది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బిల్ట్-ఇన్ మైక్ వైర్‌లెస్ ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌. 35 గంటల వరకు ప్లేటైమ్, మల్టీ-పాయింట్ బ్లూటూత్ కనెక్టివిటీ, యాప్ సపోర్ట్, వాయిస్ అసిస్టెంట్ కంపాటబిలిటీ, AUX ఇన్‌పుట్‌ను అందిస్తాయి. మొబైల్ వినియోగానికి బెస్ట్. సౌండ్, మరింత కంట్రోలింగ్ అందిస్తాయి.

అమెజాన్ ఎకో డాట్ (5వ జనరేషన్) రూ. 5,499 :
అమెజాన్ ఎకో డాట్ (5వ జనరేషన్) (​Father’s Day 2025) అనేది మెరుగైన సౌండ్ క్వాలిటీ, మోషన్ డిటెక్షన్, ఇంటర్నల్ టెంపరేచర్ సెన్సార్‌ కలిగిన స్మార్ట్ స్పీకర్. అలెక్సా వాయిస్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. స్మార్ట్ హోమ్‌, వెదర్ అప్‌డేట్స్ పొందవచ్చు.

షావోమీ పవర్ బ్యాంక్ (రూ. 1,999) : 
షావోమీ (​Father’s Day 2025) పవర్ బ్యాంక్ 4i (20000mAh) పవర్ డెలివరీ, QC 3.0 సపోర్టుతో 33W సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్‌ అందిస్తుంది. సింగిల్ ఛార్జింగ్ కోసం టైప్-C ఇన్‌పుట్, అవుట్‌పుట్, ట్రిపుల్ అవుట్‌పుట్ పోర్ట్‌లను కలిగి ఉంది. ఆండ్రాయిడ్, ఆపిల్ డివైజ్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌బడ్‌లు, స్మార్ట్‌వాచ్‌లకు సపోర్టు చేస్తుంది. క్లాసిక్ బ్లాక్ ఎండ్‌తో వస్తుంది.

Read Also : MacBook Air M1 : మ్యాక్‌బుక్ ఎయిర్ M1పై బిగ్ డిస్కౌంట్.. కేవలం రూ. 58,990కే.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?

నాయిస్ ప్రో 6 మ్యాక్స్ స్మార్ట్ వాచ్ (రూ. 7,999) :
నాయిస్ ప్రో 6 మ్యాక్స్ స్మార్ట్‌వాచ్‌లో ఇంటెలిజెంట్ ఏఐ, కస్టమైజడ్ ఏఐ వాచ్ ఫేస్‌లు, ఏఐ కంపానియన్ ఉన్నాయి. 1.96 అమోల్డ్ డిస్‌ప్లే, స్టెయిన్‌లెస్ స్టీల్ బిల్డ్, ఇంటర్నల్ GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. EN2 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. iOS, ఆండ్రాయిడ్ డివైజ్ రెండింటికీ సపోర్టు చేస్తుంది.