×
Ad

Most Powerful Phones : మొబైల్ లవర్స్ గెట్ రెడీ.. ఈ నెలలో రాబోయే టాప్ 5 పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఫీచర్లు చూస్తే ఫిదానే!

Most Powerful Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు మరికొద్దిరోజులు ఆగండి. ఈ జనవరిలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు రాబోతున్నాయి. ఒప్పో, రియల్‌మి, పోకో వంటి బ్రాండ్‌ల నుంచి మీ ఫేవరెట్ ఫోన్లు ఉన్నాయి.

Most Powerful Phones (Image Credit To Original Source)

  • ప్రీమియం మిడ్ రేంజ్ ఫోన్లు రాబోతున్నాయి
  • ఒప్పో, రియల్‌మి, పోకో వంటి బ్రాండ్ ఫోన్లపై ఫుల్ గిరాకీ
  • రూ. 20వేల నుంచి రూ. 25వేల బడ్జెట్ కేటగిరీలోనే

Most Powerful Phones : మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? 2026 జనవరిలో అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఒప్పో, రియల్‌మి, పోకో వంటి బ్రాండ్‌ల ఫోన్‌లు ఉండనున్నాయి. ఈ నెల మొదటి వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అందులో ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలలో ఏయే బ్రాండ్‌లు ఎలాంటి మోడల్స్ లాంచ్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం..

రియల్‌మి 16 ప్రో సిరీస్ :
కొత్త రియల్‌మి 16 ప్రో సిరీస్‌ అతి త్వరలో రాబోతుంది. ఈ సిరీస్ కింద కంపెనీ రియల్‌మి 16 ప్రో, రియల్‌మి 16 ప్రో ప్లస్ అనే రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేయనుంది. నివేదికల ప్రకారం.. ఈ ఫోన్లలో 200MP ప్రైమరీ కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీతో పాటు కొత్త డిజైన్‌ ఉంటాయి. అందిన సమాచారం ప్రకారం రియల్‌మి 16 ప్రో సిరీస్ జనవరి 6న లాంచ్ అవుతుంది. ఆ తర్వాత ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.

Read Also : BSNL VoWiFI : BSNL కస్టమర్లకు పండగే.. ఇకపై మొబైల్ సిగ్నల్స్ అక్కర్లేదు.. Wi-Fi ఫీచర్ చాలు.. వాయిస్ కాల్స్, మెసేజ్ పంపుకోవచ్చు

రెడ్‌మి నోట్ 15 5G :
రెడ్‌మి ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో రెడ్‌మి నోట్ 15 5G కూడా లాంచ్ చేయనుంది. ఈ రెడ్‌మి 108MP ప్రైమరీ కెమెరా కలిగి ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. కంపెనీ ఇంకా ఫోన్ ధరను వెల్లడించలేదు. కానీ, ధర రూ. 20వేల నుంచి రూ. 25వేల బడ్జెట్ కేటగిరీలో ఉంటుందని భావిస్తున్నారు. జనవరి 6న ఈ ఫోన్‌ను లాంచ్ చేయాలని భావిస్తున్నారు.

Realme 16 Pro Plus (Image Credit To Original Source)

ఒప్పో రెనో 15 సిరీస్ :

ఈ నెల ప్రారంభంలో ఒప్పో రెనో 15 సిరీస్‌ కూడా లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 15, ఒప్పో రెనో 15 ప్రో, ఒప్పో రెనో 15 మినీలను కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ ఫోన్లలో హైలైట్ కెమెరాలతో పాటు కంపెనీ ఇంకా లాంచ్ తేదీని రివీల్ చేయలేదు.

పోకో M8 :
బడ్జెట్ కేటగిరీలో పోకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ పోకో M8 పేరుతో మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలను మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ చేసింది. దీని ప్రకారం.. పోకో M8 ఫోన్‌ త్వరలో రిలీజ్ కానుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇతర స్మార్ట్‌ఫోన్‌లు కూడా జనవరిలో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. పోకో ఫోన్ కూడా అతి
త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.