BSNL VoWiFI : BSNL కస్టమర్లకు పండగే.. ఇకపై మొబైల్ సిగ్నల్స్ అక్కర్లేదు.. Wi-Fi ఫీచర్ చాలు.. వాయిస్ కాల్స్, మెసేజ్ పంపుకోవచ్చు
BSNL VoWiFI : బీఎస్ఎన్ఎల్ VoWiFi నెట్‌వర్క్ సర్వీసు ద్వారా వాయిస్ కాల్స్, మెసేజ్ ఈజీగా పంపుకోవచ్చు. మొబైల్ సిగ్నల్స్ సరిగా లేని ప్రాంతాలలో VoWiFi ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం..
BSNL VoWiFI (Image Credit To Original Source)
- బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్
- VoWiFI వై-ఫై నెట్‌వర్క్ సర్వీసు ప్రారంభం
- వాయిస్ కాల్స్, మెసేజ్ పంపుకోవడం చాలా ఈజీ
- అన్ని సర్కిళ్లలో అందుబాటులోకి
BSNL VoWiFI : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. బీఎస్ఎన్ఎల్ (BSNL) దేశవ్యాప్తంగా జనవరి 1, 2026న వాయిస్ ఓవర్ వైఫై (VoWiFi) సర్వీసును ప్రారంభించింది. ఈ VoWiFi సర్వీసుకు మొబైల్ నెట్ వర్క్ అవసరం లేదు.
మీ ఫోన్‌లో సిగ్నల్ లేకున్నా Wi-Fi నెట్‌వర్క్‌తో ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కొత్త వై-ఫై సర్వీసు అన్ని సర్కిల్‌లలో అందుబాటులో ఉంది. ఇకపై థర్డ్ పార్టీ యాప్ లేకుండానే మీ ఫోన్ నెంబర్ నుంచి Wi-Fi కాలింగ్ చేసుకోవచ్చు.
సాధారణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ఇళ్ళు, బేస్‌మెంట్‌లు లేదా ఆఫీసుల లోపల మొబైల్ సిగ్నల్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ కొత్త VoWiFi సర్వీసు కవరేజ్ తక్కువగా ఉన్న ఈ ప్రాంతాలలో కూడా కాలింగ్ సర్వీసు వర్క్ అవుతుంది. ఈ సర్వీసు చాలావరకు కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో డిఫాల్ట్ సపోర్టుతో వస్తుంది. వినియోగదారులు ఫోన్ సెట్టింగ్స్‌లో Wi-Fi కాలింగ్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్‌స్టంట్ Wi-Fi ద్వారా కాల్స్ చేసుకోవచ్చు.
VoWiFi ఏంటి? ఎలా వర్క్ అవుతుంది? :
VoWiFi (వాయిస్ ఓవర్ వై-ఫై) కాలింగ్ అనేది ఇంటర్నెట్ ఆధారిత వై-ఫై నెట్‌వర్క్. ఈ నెట్‌వర్క్ ఉపయోగించి వాయిస్ కాల్స్, మెసేజ్‌లు చేసుకోవచ్చు. మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్ లేకుండా కూడా కాల్స్ చేసుకోవచ్చు. మొబైల్ కవరేజ్ అందుబాటులో లేని ప్రాంతాలలో కూడా క్లియర్ వాయిస్ వినిపిస్తుంది.
BSNL announces nationwide rollout of Voice over WiFi ( VoWifi) !!
When mobile signal disappears, BSNL VoWiFi steps in.Make uninterrupted voice calls over Wi-Fi on your same BSNL number anytime, anywhere.
Now live across India for all BSNL customers,
Because conversations… pic.twitter.com/KPUs79Lj9w— BSNL India (@BSNLCorporate) January 1, 2026

BSNL VoWiFI (Image Credit To Original Source)
VoWiFi ద్వారా కాల్స్ చేస్తున్నప్పుడు మీ మొబైల్ నంబర్ ఫోన్ డయలర్ అలాగే ఉంటాయి. ఇందుకోసం స్పెషల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫీచర్ ద్వారా మొబైల్ నెట్‌వర్క్ నుంచి Wi-Fi నెట్‌వర్క్ మధ్య ఈజీగా మారవచ్చు. అలాగే కాల్స్ డ్రాపింగ్ సమస్య కూడా ఉండదు.
VoWiFi ఎలా సెటప్ చేయాలంటే? :
- మీ ఫోన్‌లో VoWiFi వాడం చాలా ఈజీ. ఇలా ట్రై చేయండి.
- Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వండి
- ఫోన్ సెట్టింగ్స్ (Settings) ఆప్షన్‌కు వెళ్లండి
- మొబైల్ నెట్‌వర్క్, Wi-Fi కాలింగ్ ఆప్షన్ ఎంచుకోండి
- VoWiFi, Wi-Fi కాలింగ్ ఆన్ చేయండి
- VoWiFi యాక్టివేట్ చేసిన తర్వాత కాల్స్ మాట్లాడుకోవచ్చు.
పాత స్మార్ట్‌ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. కానీ, రాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్లలో VoWiFi సపోర్టుతో ఆటోమాటిక్‌గా ఈ ఫీచర్ ఎనేబుల్ అయి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోండి. మీకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఫోన్ స్క్రీన్ పైభాగంలో నెట్‌వర్క్ బార్ పక్కన Wi-Fi ఐకాన్ కనిపిస్తుంది.
