Chirag Tyagi : పారా అథ్లెట్ చిరాగ్ దారుణ హత్య.. రెండు రోజుల క్రితం గోల్డ్ మెడల్..
జాతీయ స్థాయిలో సత్తా చాటి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి (Chirag Tyagi) అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు.
para athlete chirag tyagi was found dead
Chirag Tyagi : జాతీయ స్థాయిలో సత్తా చాటి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని మురద్‌నగర్‌కు చెందిన 25 ఏళ్ల చిరాగ్ త్యాగి ఘజియాబాద్‌లోని సాయి కుంజ్ ప్రాంతంలో మృతి చెంది కనిపించాడు. అతడిని.. స్నేహితుడు, తోటి పోటీదారుడు యశ్ ఖటిక్ కాల్చి చంపాడు.

పోలీసుల కథనం ప్రకారం.. ఖటిక్ గతంలో త్యాగితో కలిసి శిక్షణ పొందాడు. వారు అంధుల విభాగంలో అథ్లెటిక్స్‌లో ఒకరితో ఒకరు పోటీపడ్డారు. దాదాపు దశాబ్దకాలంగా స్నేహితులుగా ఉన్నారు. ఒకే గదిలో కలిసి ఉన్నారు. ప్రతిదీ పంచుకున్నారు. గత ఐదేళ్లుగా కఠోర శిక్షణ తీసుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు.
అయితే.. త్యాగి తన పత్రాల ధృవీకరణకు సంబంధించి ఖటిక్పై గతంలో ఫిర్యాదు చేయడంతో, అతను అనర్హుడయ్యాడు. ప్రతీకారంతో రగిలిపోయిన ఖటిక్.. త్యాగిని ఒక నిర్మానుష్య ప్రదేశానికి రప్పించి అతని వీపుపై కాల్చి చంపాడు అని డీసీపీ ధవల్ జైస్వాల్ అన్నారు.
Vaibhav Sooryavanshi : వీడు మామూలోడు కాదు.. వైభవ్ బ్యాటా మజాకానా.. 12 కోట్లు..
కాగా.. రెండు రోజుల క్రితం బెంగళూరులో జరిగిన జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల రేసులో చిరాగ్ త్యాగి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఈ క్రమంలో అతడు పారా ఆసియా గేమ్స్‌కు అర్హత సాధించాడు. జపాన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో పారా ఆసియా గేమ్స్ జరగనున్నాయి.
