Rolls Royce: కోట్లు ఖరీదుచేసే రోల్స్ రాయ్స్ కార్లు, రోడ్లపక్కన దుమ్ము కొట్టుకుపోతున్నాయి

రోల్స్ రాయ్స్ కార్లు అత్యంత ఖరీదైనవే అదే స్థాయిలో అరుదైనవి కూడా. అందుకే అవి చాలా స్పెషల్. రోల్స్ రాయ్స్ 1906లో తయారైనప్పటి....

Rolls Royce: రోల్స్ రాయ్స్ కార్లు అత్యంత ఖరీదైనవే అదే స్థాయిలో అరుదైనవి కూడా. అందుకే అవి చాలా స్పెషల్. రోల్స్ రాయ్స్ 1906లో తయారైనప్పటి నుంచి వాటి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ కార్లలో 80శాతం రోడ్ల పక్కన లేదంటే షెడ్లకే పరిమితమవుతుంటాయి. కొన్ని వాడకానికి పనికిరాకుండా పక్కకుబెడితే మరి కొన్ని అలంకారానికే ఫిక్స్ అవుతున్నాయి.

Rolls Royce Ghost

రోల్స్ రాయ్స్ ఘోస్ట్
ఈ కార్ ను పోలీసులు సీజ్ చేసి కాంపౌండ్ లో పడేసి ఉంచారు. బెంగళూరుకు చెందిన మొహమ్మద్ నీషమ్ అనే వ్యక్తి.. ఓ మహిళా పోలీస్ అధికారి కార్ ఆపబోతే ఆమెను కారులో ఎక్కించుకుని మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి కార్ తాళాలు తీసి పక్కకుపారేశాడు. ఇప్పుడు ఎంత అందమైన కార్ అయితే ఏంటి.. దుమ్ము కొట్టుకుని పోలీస్ కాంపౌండ్ లో పడి ఉంది.

Rolls Royce Phantom

రోల్స్ రాయ్స్ ఫాంటం
ఈ బ్రాండ్ నుంచి వచ్చిన అత్యంత ఖరీదైన వెహికల్.. లీనా మారియా పాల్ అనే నటికి చెందిన వెహికల్.. కెనరా బ్యాంక్ స్కాంలో దొరికిపోయింది. ఆమెను అరెస్టు చేసి దాంతో పాటు పలు వాహనాలను కూడా సీజ్ చేశారు. ఢిల్లీలోని ఫామ్ హౌజ్ లో లాక్ అయి ఉన్న వెహికల్ ను పోలీసులు రిలీజ్ చేయాల్సి ఉంది. ఒక సారి కోర్టు అనుమతి ఇస్తే ఆ దుమ్ము నుంచి కార్లన్నీ బయటకు వచ్చినట్లే.

Rolls Royce Silver Spur

రోల్స్ రాయ్స్ సిల్వర్ స్పర్ II
లైఫ్ టైంలో మోడల్ మారకుండా రీ డిజైన్ అయ్యేది రోల్స్ రాయ్స్ కార్లు మాత్రమే. ఈ వింటేజ్ సిల్వర్ స్పర్ II.. 1980ల నుంచి ఏ మాత్రం తేడా లేకుండా మార్కెట్ లోకి వచ్చింది. ఈ కార్ మహారాష్ట్రలోని రోడ్ పక్కన కనిపించింది. ఈ వెహికల్ పారేయడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.

Rolls Royce

రోల్స్ రాయ్స్ సిల్వర్ షాడో
మహారాష్ట్రలోని ఖండాలా టూరిస్ట్ స్పాట్ లో కనిపించింది ఈ సిల్వర్ షాడో. దీని ఓనర్ పేరు తెలియదు కానీ, దీనిపై రూమర్లు మాత్రం ఏదో భూతం ఉందని. చాలా మంది కార్లో ఉన్న అతీత శక్తి గురించి తెలుసుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నించారు.

Rolls Royce Silver Spirit Mark 3

రోల్స్ రాయ్స్ సిల్వర్ స్పిరిట్
ఇది చాలా అరుదైన కార్. 1993 నుంచి 1996 మధ్య కాలంలో ప్రొడ్యూస్ అయింది. 6.75 లీటర్లతో వీ8 ఇంజిన్ తో రెడీ అయిది. ఇంకా వర్కింగ్ కండీషన్ లోనే ఉన్న ఈ కార్ ను ఎందుకో రోడ్ పక్కనే వదిలేశాడు ఓనర్.

ట్రెండింగ్ వార్తలు