Smartphone Speed Up : మీ పాత స్మార్ట్ ఫోన్ స్పీడ్ పెంచే 5 సూపర్ టిప్స్.. ట్రిక్స్..

మీ పాత స్మార్ట్ ఫోన్ స్లోగా ఉందా? ఏది ఓపెన్ చేసినా స్టక్ అయిపోతుందా? ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు స్లో కావడానికి అనేక కారణాలు ఉంటాయి. కొత్త స్మార్ట్ ఫోన్ కోసం ఎందుకు డబ్బులు ఖర్చుచేస్తారు.

5 super tips tricks for speed up Android Phone : మీ పాత స్మార్ట్ ఫోన్ స్లోగా ఉందా? ఏది ఓపెన్ చేసినా స్టక్ అయిపోతుందా? ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు స్లో కావడానికి అనేక కారణాలు ఉంటాయి. కొత్త స్మార్ట్ ఫోన్ కోసం ఎందుకు డబ్బులు ఖర్చుచేస్తారు. పాత స్మార్ట్ ఫోన్ స్పీడ్ గా పనిచేసేలా ప్రయత్నించవచ్చు కదా.. అయితే మీ కోసం స్మార్ట్ ఫోన్ స్లో ఉంటే.. ఎలా స్పీడ్ పెంచుకోవాలో 5 సూపర్ టిప్స్, ట్రిక్స్ ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

1. ఫోన్ రిస్టార్ట్ చేయండి :
ఇదో సింపుల్ ట్రిక్.. ఫోన్ రిస్టార్ట్ చేయండి.. ఇలా చేసినప్పుడు బ్యాక్ గ్రౌండులో మెమెరీ క్లీన్ అవుతుంది. ఏదైనా యాప్స్ స్టక్ అయితే అవి కూడా ఫిక్స్ అవుతాయి. రిస్టార్ట్ ఆప్షన్ కనిపించేంతవరకు మీ ఫోన్ పవర్ బటన్.. నొక్కి పట్టండి..

2. క్యాచీ క్లియర్ చేయండి :
మీ ఫోన్ లో క్యాచీని ఎప్పటికప్పుడూ క్లియర్ చేస్తుండండి.. క్యాచీ మెమెరీ అనేది ర్యామ్ పై ఎఫెక్ట్ పడుతుంది. దాంతో ర్యామ్ స్పీడ్ తగ్గుతుంది. స్లోగా పనిచేస్తుంది. అప్పుడు ఫోన్ కూడా స్లో అయిపోతుంది.. Settings- Storgage-Cache ఆప్షన్ దగ్గర్ క్యాచీ క్లియర్ ఆప్షన్ ఓకే సరిపోతుంది.. క్యాచీ మెమరీ క్లియర్ అవుతుంది.

3. యానిమేషన్స్ డిసేబుల్ :
విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్స్ ఎనేబుల్ అయితే కూడా ఫోన్ స్లో అయిపోతుంది. మెమెరీని లాగేస్తాయి. అందుకే యానిమేషన్స్ మొత్తం కంప్లీట్ గా టర్న్ ఆఫ్ చేయండి.. Settings-About Phone-Build Number పై పలుమార్లు క్లిక్ చేయండి. మీకు Developer అనే ఆప్షన్స్ కనిపించేంతవరకు అలాగే ట్యాప్ చేయండి. అప్పుడు మీకు Settings-Developer Options-Windows-Animation Scale-Animations off చేసేస్తే సరిపోతుంది.

4. యాప్స్ రిమూవ్ :
మీ ఫోన్ ల్లో అనవసరమైన యాప్స్ రిమూవ్ చేసేయండి. ఈ యాప్స్ వల్ల మీ ఫోన్ స్పేస్ నిండిపోతుంది. రెగ్యులర్ గా వాడే యాప్స్ ఎప్పటికప్పడూ అప్ డేట్స్ అయ్యేలా చూసుకోండి. లేటెస్ట్ వెర్షన్లలోకి అప్ డేట్ చేయడం ఎంతో ఉత్తమం. ప్రతి అప్ డేట్ లో కంపెనీలు బగ్స్ ఫిక్స్ చేస్తుంటాయి. యాప్స్ పర్ఫార్మానెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది.

5. కస్టమ్ ROMs :
మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆ బ్రాండ్ కంపెనీ తమ సొంత ROM ను ఇన్ స్టాల్ చేస్తుంటాయి. అందుకే మీ ఫోన్ అప్పుడప్పుడు స్లో అవుతుంటుంది. ఒకవేళ ఫోన్ ఎక్కువ సమయం స్లో అవుతుంటే.. కొన్ని కస్టమ్ ROMs ట్రై చేయొచ్చు. థర్డ్ పార్టీ ROMs వంటి నోవా లాంచర్ లేదా అపెక్స్ లాంచర్ యాప్స్ వాడొచ్చు.. మీ ఫోన్ సాఫ్ట్ వేర్ ఆధారంగా ఫోన్ స్పీడ్ పెరిగిపోవడానికి అవకాశం ఉంది.

ఫ్యాక్టరీ రీసెట్ :
మీ ఆండ్రాయిడ్, లేదా ఐఫోన్ అప్పటికీ స్లోగానే ఉంటే మాత్రం.. చివరి ప్రయత్నంగా ఫ్యాక్టరీ రీసెట్ చేయండి.. ఇలా చేయడం ద్వారా మీ ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉందో అలానే రీసెట్ అయిపోతుంది. అందుకు చేసిన సెట్టింగ్స్ రిమూవ్ అవుతాయి. iPhoneలో అయితే Settings-Apple ID-Backup Now అని సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే Settings-sytem-Advanced-Rest Options-Erase All Data (Factory Reset)-Rest Phone క్లిక్ చేస్తే చాలు.. మీ ఫోన్ మొత్తం రీసెట్ అయిపోతుంది. ఇలా చేసినప్పుడు మీ మెమెరీ కార్డులో డేటా ఉంటే మాత్రం డేటా రీసెట్ విషయంలో కాస్తా జాగ్రత్త ఉండాలి.

ట్రెండింగ్ వార్తలు