×
Ad

Best Phones 2026 : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. 2026లో ఐఫోన్ 17 కన్నా 6 బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లు.. ఏది కొంటారంటే?

Best Phones 2026 : 2026లో ఐఫోన్ 17 కన్నా బెటర్ ఫోన్‌ కోసం చూస్తున్నారా? మల్టీఫేస్ కెమెరాలను అందించే 6 అద్భుతమైన ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి.. ఇందులో ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి.

Best Phones 2026

  • కెమెరా సెంట్రలైజడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల కోసం చూస్తున్నారా?
  • 2026లో ఆపిల్ ఐఫోన్ 17 కన్నా 6 అద్భుతమైన ఫోన్లు ఇవే
  • ఆకర్షణీయమైన డిస్‌ప్లేలు, పవర్‌ఫుల్ కెమెరాలు
  • ఐఫోన్ 17 ధర కన్నా తక్కువకే ఆండ్రాయిడ్ ఫోన్లు

2026లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 కన్నా అదిరిపోయే ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులోనూ కెమెరా-సెంట్రలైజడ్ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆధారిత పవర్‌హౌస్‌ల వరకు ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

స్పీడ్ చిప్‌సెట్, భారీ బ్యాటరీలు, ఆకర్షణీయమైన డిస్‌ప్లేలు, పవర్‌ఫుల్ కెమెరాలతో ఈ స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. 2026లో ఆపిల్ ఐఫోన్ కొనాలని అనుకునేవారికి ఈ 6 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.

గూగుల్ పిక్సెల్ 10 ధర రూ. 74,999 :
స్మార్ట్ సాఫ్ట్‌వేర్, అద్భుతమైన కెమెరాలతో గూగుల్ పిక్సెల్ 10 అద్భుతంగా ఉంటుంది. టెన్సర్ జీ5 చిప్‌తో ఈ ఫోన్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన ఏఐ ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. 48MP మెయిన్ కెమెరా, 5x టెలిఫోటో, అల్ట్రావైడ్ లెన్స్ డైనమిక్ రేంజ్ అందిస్తాయి. 2026లో ఐఫోన్ 17 కన్నా అద్భుతమైన ఫోన్‌గా నిలుస్తుంది.

​శాంసంగ్ గెలాక్సీ S25 ధర రూ. 68,999 :
శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ 120Hz రిఫ్రెష్‌తో 6.2-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లేను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ట్రిపుల్ 50MP కెమెరా సెటప్, వన్ యూఐ ఎక్స్‌పీరియన్స్, లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్టు అందిస్తుంది. 2026లో ఐఫోన్ 17 కన్నా ఎక్కువ మంది ఈ శాంసంగ్ ఫోన్ కొనేసుకోవచ్చు.

వివో X300 ధర రూ. 75,999 :
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం వివో X300 అద్భుతంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.31-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో భారీ 200MP మెయిన్ కెమెరా ఉన్నాయి. పెరిస్కోప్, అల్ట్రావైడ్ లెన్స్‌లతో పాటు డైమెన్సిటీ 9500 పర్ఫార్మెన్స్ సపోర్టుతో వస్తుంది. 2026 కొనుగోలుదారులకు ఐఫోన్ 17కు మించి మెరుగైన ఇమేజింగ్ ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది.

Read Also : PM Kisan Budget 2026 : పీఎం కిసాన్ 22వ విడతపై బిగ్ అప్‌డేట్.. ఫిబ్రవరి 1 బడ్జెట్ రోజునే రైతుల ఖాతాల్లోకి రూ. 2వేలు? ఫుల్ డిటెయిల్స్

వన్‌ప్లస్ 15, ధర రూ. 72,999 :
వన్‌ప్లస్ 15 ఫోన్ 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ ప్యానెల్‌తో 165Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ద్వారా ఆధారితంగా రన్ అవుతుంది. 16GB వరకు ర్యామ్, భారీ 7300mAh బ్యాటరీతో వస్తుంది. 2026లో ఐఫోన్ 17 కొనే బదులు వన్ ప్లస్ కొనేసుకోవడం బెటర్..

ఐక్యూ 15, ధర రూ. 72,999 :
గేమర్స్ కోసం ఐక్యూ 15 ఫోన్ అద్భుతంగా ఉంటుంది. 144Hz ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, 8K వీడియోతో ట్రిపుల్ 50MP కెమెరా సెటప్‌ అందిస్తుంది. భారీ 7000mAh బ్యాటరీతో ఐఫోన్ 17 కన్నా బెటర్ పవర్ ఆప్షన్ అందిస్తుంది. 2026లో ఐఫోన్ మోడల్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఫోన్ ఇదే..

ఒప్పో ఫైండ్ X9 ధర : రూ.72,990 :
ఒప్పో ఫైండ్ X9 ఫోన్ 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. డాల్బీ విజన్‌కు సపోర్టు ఇస్తుంది. డైమెన్సిటీ 9500 పవర్, 16GB వరకు ర్యామ్, భారీ 7025mAh బ్యాటరీతో రోజంతా ఛార్జింగ్ అందిస్తుంది. హాసెల్‌బ్లాడ్-ట్యూన్ ట్రిపుల్ 50MP కెమెరాలు, 2026లో ఐఫోన్ 17 కన్నా ఈ ఒప్పో బెటర్ ఫోన్ అని చెప్పొచ్చు.