6 Camera Phones
6 Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ మార్కెట్లో అత్యుత్తమ కెమెరా ఫోన్.. ఫోటోలు, వీడియోలకు బెస్ట్ ఫోన్ (6 Camera Phones) అని చెప్పొచ్చు. అలాంటి శాంసంగ్ ఫోన్‌కు పోటీగా మరెన్నో స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
ఈ ఫోన్‌లు ఆకర్షణీయమైన కెమెరా ఫీచర్లతో మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ కన్నా మెరుగైన మొబైల్ ఫొటోగ్రఫీ అందిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా కన్నా అద్భుతమైన కెమెరా ఫీచర్లు కలిగిన 6 స్మార్ట్‌ఫోన్లపై ఓసారి లుక్కేయండి..
ఒప్పో ఫైండ్ X8 ప్రో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల LTPO అమోల్డ్ ప్యానెల్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 9400 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. క్వాడ్ 50MP బ్యాక్ లెన్స్, 32MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. తద్వారా శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మాదిరిగా క్రిస్టల్-క్లియర్ షాట్స్ క్యాప్చర్ చేయవచ్చు.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో (రూ. 89,999) :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్ అందించే 6.3-అంగుళాల సూపర్ యాక్టువా డిస్‌ప్లేతో వస్తుంది. గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ట్రిపుల్ 50MP+48MP+48MP బ్యాక్ కెమెరా, 42MP సెల్ఫీ షూటర్ ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మాదిరిగానే ప్రతి షాట్‌లో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.
6 Camera Phones : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా (రూ. 49,999) :
కొత్త మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.7-అంగుళాల pOLED ప్యానెల్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ట్రిపుల్ 50MP+50MP+64MP ప్రైమరీ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా క్లారిటీ, షార్ప్‌నెస్‌ను అందిస్తుంది.
ఈ షావోమీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో షావోమీ 15 ప్రో 6.36-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ట్రిపుల్ 50MP+50MP+50MP బ్యాక్ కెమెరా సెటప్, 32MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
వన్‌ప్లస్ 13 (రూ. 62,999) :
వన్‌ప్లస్ 13 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల LTPO 4.1 అమోల్డ్ ప్యానెల్‌ను డిస్‌ప్లే చేస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ట్రిపుల్ 50MP+50MP+50MP ప్రైమరీ లెన్స్, ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ మాదిరిగానే అద్భుతంగా ఉంటుంది.
వివో X200 (రూ. 65,900) :
వివో X200 ఫోన్ 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 9400 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ట్రిపుల్ 50MP+50MP+50MP మెయిన్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ మాదిరిగానే అద్భుతమైన షాట్స్ అందిస్తుంది.