Human Brain Drones : మనిషిలాగే ఆలోచించే డ్రోన్! నిఘాలో కీలకం
నేటి ఆధునిక సమాజానికి టెక్నాలజీ అనే చాలా అవసరం. టెక్నాలజీ లేకపోతే చాలా పనులు నిలిచిపోతాయి. రాను రాను అన్ని రంగాల్లో సాంకేతికకు ప్రాముఖ్యత పెరుగుతుంది. వైద్యరంగంతోపాటు, రక్షణ రంగంలో కూడా టెక్నాలజీ పాత్ర చాలావరకు ఉంటుంది. ఇక ఇప్పుడు నేరాలను అరికట్టేందుకు కూడా టెక్నాలజీని అధికంగా ఉపయోగిస్తున్నారు. నేరాల నివారణకు సీసీకెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు పోలీస్ అధికారులు.

Human Brain Drones
Human Brain Drones : నేటి ఆధునిక సమాజానికి టెక్నాలజీ అనే చాలా అవసరం. టెక్నాలజీ లేకపోతే చాలా పనులు నిలిచిపోతాయి. రాను రాను అన్ని రంగాల్లో సాంకేతికకు ప్రాముఖ్యత పెరుగుతుంది. వైద్యరంగంతోపాటు, రక్షణ రంగంలో కూడా టెక్నాలజీ పాత్ర చాలావరకు ఉంటుంది. ఇక ఇప్పుడు నేరాలను అరికట్టేందుకు కూడా టెక్నాలజీని అధికంగా ఉపయోగిస్తున్నారు. నేరాల నివారణకు సీసీకెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు పోలీస్ అధికారులు.
ఇలా ఇదిలా ఉంటే నేరాలు అరికట్టడానికి, నేర పరిశోధనలోనూ టెక్నాలజీ ఇప్పుడు ముఖ్య భూమిక పోషిస్తోంది. అయితే ఎంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నా.. దానికంటూ కొన్ని పరిమితులు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పరిమితులను సైతం అధిగమించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. తాజాగా చెక్ రిపబ్లిక్ సైంటిస్టులు డ్రోన్‌లకు అచ్చు మనిషి బుర్ర లాంటి వ్యవస్థను బిగించారు. దీని ద్వారా నేరస్తుల కదలికలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దీని ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.
సాధారణంగా జన సందోహం ఎక్కువగా ఉన్న చోట మ్యాన్ పవర్‌తో నిఘా నిర్వహించడం కష్టతరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో డ్రోన్ ద్వారా కదలికలను పరిశీలిస్తుంటారు. అయితే డ్రోన్ సేవలు పరిమితమే కావడం, అనుమానిత కదలికలను సరిగా అంచనా వేయడంలో డ్రోన్‌లు విఫలమవుతున్నాయి. వీటిని అధిగమించేందుకు మనిషి మేధస్సును డ్రోన్‌లకు బిగించాలని చెక్ సైంటిస్టులు నిర్ణయించారు.
పనితీరు..
ఇది మనిషి బుర్రలాంటి న్యూరాల్ నెట్‌వర్క్ ని డ్రోన్‌లలో సెటప్ చేశారు. ఇది సర్వేలెన్స్ సిస్టమ్ లాగ పనిచేస్తుంది. ఏదైనా ఎదురైనప్పుడు మనిషిలాగే బుర్ర పెట్టి ఆలోచన స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. జన సందోహంలో మనుషుల ముఖ కవళికలు, ప్రవర్తన ద్వారా ఏది నార్మల్ ఏది అబ్‌నార్మల్ అనేది నిర్ణయించుకుంటుంది.
ప్రసుతం ఇది ప్రయోగ దశలో ఉంది. మొదటిసారి ఫుట్‌బాల్ మైదానంలో ఆటగాళ్ల మీద ఈ ‘బ్రెయిన్ డ్రోన్’లను ప్రయోగించారు. ఈ పరీక్ష విజయవంతమైనట్లు పరిశోధకులు తెలిపారు. ఆటగాళ్ల హావభావాలు గుర్తించడంలో ఇది చక్కగా పనిచేసినట్లు పేర్కొన్నారు. ముఖ కవళికలను బట్టి ఆటగాడు అబద్దం ఆడుతున్నాడా? నిజం చెబుతున్నాడా అనేది వారి ముఖ కవళికలను బట్టి ఇది గుర్తించింది.వాళ్ల ప్రవర్తన ఆధారంగా వాళ్లు అబద్దం ఆడారనే ఒక నిర్ధారణకు వచ్చింది. వెంటనే ఈ డ్రోన్ సిస్టమ్ అబ్జర్వర్ ను అప్రమత్తం చేసింది.
హ్యూమన్ బ్రెయిన్ న్యూరాల్ నెట్‌వర్క్‌ను బ్రోనో యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, చెక్ రిపబ్లిక్ పోలీస్ వ్యవస్థ సహకారంతో రూపొందించారు.
ఇది జన సందోహం నడుమ నిఘాతో పాటు ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం కూడా ఉపయోగించనున్నారు. అయితే జన సందోహం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డ్రోన్ సిస్టమ్ కొంత తడబడే ఛాన్స్ ఉంది.
అందుకని సెన్సిటివ్ లెవల్‌ను ఏర్పాటు చేశాకే పూర్తిస్థాయిలో వాడకంలోకి తీసుకొస్తామని బ్రోనో సైంటిస్ట్ డేవిడ్ బేజౌట్ చెప్తున్నాడు. ఇది అందుబాటులోకి వస్తే నేరగాళ్ళను, నరాలకు పాల్పడాలి అనుకునేవారికి యిట్టె పట్టుసుకోవచ్చు. మనిషి ముఖ కవళికలు గుర్తించి పోలీసులను అప్రమమతం చేసే ఈ వ్యవస్థ రక్షణ రంగానికి ఎంతగానో సహకరిస్తుంది. దీని ద్వారా జనావాసాల్లో ఉన్న ఉగ్రవాదులను గుర్తించడం తేలికవుతుంది.