Aadhaar Card Update
Aadhaar Card Update : మీ ఆధార్ కార్డులో వివరాలను మార్చుకోవాలా? ఇటీవలే మీరు ఇల్లు మారినా లేదా కొత్త సిటీకి మారితే మీ ఆధార్ వివరాలను (Aadhaar Card Update) అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై ఆధార్ కార్డులో మీ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ లేదా ఫోన్ నంబర్ ఏదైనా మార్పులు చేయడం చాలా సులభం.
ఆధార్ సెంటర్ కోసం ఎక్కడికి పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదు. కేవలం మీ కీలక సమాచారాన్ని ఆన్‌లైన్‌లోనే సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఈ కొత్త ఆన్‌లైన్ ప్రక్రియను ప్రవేశపెట్టింది.
నవంబర్ 2025 నుంచి వినియోగదారులు ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా కీలకమైన ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. UIDAI ఐడెంటిటీని వెరిఫై చేయడంతో పాన్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్ వంటి ప్రస్తుత ప్రభుత్వ డాక్యుమెంట్లను అనుమతిస్తుంది.
ఇకపై ఒకే డాక్యుమెంట్లను పదే పదే అప్‌లోడ్ చేయడం కుదరదు. ఇందుకోసం ఎలక్ట్రిసిటీ బిల్లు వంటి యుటిలిటీ పేమెంట్స్ అడ్రస్ ప్రూఫ్‌గా ఇవ్వొచ్చు. మీ వద్ద రెంట్ అగ్రిమెంట్ లేదా పాస్‌పోర్ట్ వంటి డాక్యుమెంట్లు ఉన్నా మీ అడ్రస్ ఈజీగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
UIDAI ఆధార్‌ను డిజిటల్‌గా మార్చేందకు కొత్త మొబైల్ యాప్‌పై టెస్టింగ్ చేస్తోంది. ఈ యాప్ ద్వారా యూజర్లు తమ ఆధార్‌ను సేఫ్ డిజిటల్ వెర్షన్‌కు మార్చుకోవచ్చు. QR కోడ్‌తో యాక్సస్ చేయొచ్చు. ఫిజికల్ ఫొటోకాపీల అవసరం ఉండదు. మీ కేవైసీ కోసం ఆధార్‌ను షేర్ చేయాల్సి వచ్చినా సేఫ్టీ, మాస్క్డ్ ఫార్మాట్‌లో మాత్రమే యాక్సస్ చేయొచ్చు.
మీ ఆధార్ అడ్రస్ మాత్రమే అప్‌డేట్ చేస్తుంటే.. జూన్ 14, 2026 వరకు (myAadhaar) పోర్టల్‌లో ఫ్రీగా అప్‌డేట్ చేయవచ్చు. OTP వెరిఫికేషన్ తప్పనిసరి. ఆధార్, మొబైల్ నంబర్‌తో లింక్ చేసి ఉండాలి. ఒకవేళ మీ ఫోన్ నంబర్‌ను ఆధార్‌తో ఇంకా లింక్ చేయకపోతే వెంటనే చేసేయండి. ఆధార్ ఆధారిత సేవలను పొందాలంటే తప్పనిసరిగా మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. లేదంటే అనేక ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది.