iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్లపై అదిరే ఆఫర్.. భారీ తగ్గిన ఐఫోన్ 16, 16 ప్రో మ్యాక్స్.. ఈ బిగ్ డీల్స్ అసలు వదులుకోవద్దు..!
iPhone 16 Series : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

iPhone 16 Series
iPhone 16 Series : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆన్‌లైన్‌లో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ ధర భారీగా తగ్గింది. ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ మార్కెట్లో బాగా పాపులర్ అయింది. ఇప్పటికీ, ఈ ఐఫోన్ (iPhone 16 Series) మోడళ్లకు ఫుల్ డిమాండ్ ఉంది. అమెజాన్ ఇండియాలో ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో మాక్స్ రెండింటిపై బెస్ట్ డీల్స్ అందిస్తోంది. ఈ ఐఫోన్‌లలో ఏదైనా ఒకటి కొనుగోలు చేయొచ్చు.. తక్కువ ధరకే ఐఫోన్ 16 సిరీస్ డీల్స్ ఎలా పొందాలంటే?
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16 ధర తగ్గింపు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అమెజాన్ ఇండియాలో లభ్యమవుతుంది. ఈ ఐఫోన్ అసలు ధర రూ.1,44,900కు బదులుగా రూ.1,35,900కు 6శాతం తగ్గింపుతో లభిస్తుంది.
128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 16 మోడల్ అమెజాన్ ఇండియాలో అసలు ధర రూ.79,900 నుంచి రూ.72,400కు కొనుగోలు చేయవచ్చు. అదనంగా, కస్టమర్లు అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.2,172 వరకు అమెజాన్ పే బ్యాలెన్స్ క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.
ఐఫోన్ 16 ప్రో మాక్స్, ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఎంట్రీ-లెవల్ మోడల్‌లో 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఆపిల్ A18 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ ఐఫోన్ 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 48MP ప్రైమరీ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 3561mAh బ్యాటరీతో పాటు 25W మ్యాగ్‌సేఫ్, 15W Qi వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఈ ఫోన్ అల్ట్రామెరైన్, టీల్, వైట్, బ్లాక్, పింక్ అనే 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల LTPO సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే కలిగి ఉంది. బేస్ మోడల్‌లో 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్‌ను అందిస్తుంది. ఈ ఐఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 48MP ప్రైమరీ షూటర్, 48MP అల్ట్రావైడ్ యాంగిల్ షూటర్, 12MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 12MP స్నాపర్ కలిగి ఉంది. ఈ ఫోన్ 4685mAh బ్యాటరీతో పాటు 25W మ్యాగ్‌సేఫ్, 15W Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. నేచురల్ టైటానియం, డెసర్ట్ టైటానియం, వైట్ టైటానియం, బ్లాక్ టైటానియం అనే 4 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.