Google Play Store: గూగుల్ ప్లేస్టోర్ నుంచి 9లక్షల యాప్ తొలగింపు

గూగుల్ ప్లేస్టోర్ నుంచి 9లక్షల యాప్ లను తొలగించేందుకు గూగుల్ రెడీ అయింది. యాండ్రాయిడ్ అథారిటీ సమాచారం ప్రకారం.. యాప్ ల అప్ డేట్ అడుగుతున్నా పట్టించుకోని డెవలపర్లకు ఇది షాకింగ్ డెసిషన్.

Google Play Store: గూగుల్ ప్లేస్టోర్ నుంచి 9లక్షల యాప్ తొలగింపు

Google Play Store Google Banning All Call Recording Apps From Play Store Starting May 11 (1)

Updated On : May 17, 2022 / 6:18 PM IST

 

 

Google Play Store: గూగుల్ ప్లేస్టోర్ నుంచి 9లక్షల యాప్ లను తొలగించేందుకు గూగుల్ రెడీ అయింది. యాండ్రాయిడ్ అథారిటీ సమాచారం ప్రకారం.. యాప్ ల అప్ డేట్ అడుగుతున్నా పట్టించుకోని డెవలపర్లకు ఇది షాకింగ్ డెసిషన్.

అంతకంటే ముందు రెండేళ్లుగా ఎటువంటి అప్ డేట్ లేని యాప్ లను తొలగించేందుకు యాపిల్ డిసైడ్ అయింది. ఆ యాప్ మేకర్స్ కు యాపిల్ ఈమెయిల్ ద్వారా విషయాన్ని తెలియజేసింది కూడా. తమ యూజర్ల ప్రైవసీనే ప్రాధాన్యంగా తీసుకుంటూ గూగుల్, యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నాయిన టెక్ మీడియా చెబుతుంది.

అప్ డేట్స్ విడుదల చేయని యాప్ లను గూగుల్ ముందుగా హైడ్ చేసేస్తుంది. దీంతో కొత్తగా వాడాలనుకునే యూజర్ వీటిని డౌన్ లోడ్ చేసుకోలేరు. యాప్‌ల పాత వెర్షన్లలో మార్పులు చేసుకునే సౌకర్యం ఉండదు. అది యాండ్రాయిడ్ ఫోన్ అయినా ఐఓఎస్ అయినా. సెక్యూరిటీ నిమిత్తం కొత్త పద్ధతులను పాటించాలి. అందుకే పాత యాప్ లను తొలగించాల్సి వస్తుందని చెబుతున్నారు.

మరో వైపు గూగుల్‌ ఇటీవల థర్డ్‌ పార్టీ కాల్‌ రికార్డింగ్‌ యాప్‌లను నిషేధించింది. గత నెలలోనే అన్ని కాల్ రికార్డింగ్ యాప్స్ ప్లే స్టోర్ నుంచి నిషేధం విధిస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్లే స్టోర్‌ విధానంలో మార్పులు తీసుకురాగా.. ఈ నెల 11 నుంచి కాల్‌ రికార్డింగ్‌ యాప్స్‌ను బ్యాన్‌ చేసింది.