Acer Aspire Go 14
Acer Aspire Go 14 Launch : విద్యార్థుల కోసం ఏసర్ కంపెనీ బడ్జెట్-ఫ్రెండ్లీ AI ల్యాప్‌టాప్ తీసుకొచ్చింది. ఫస్ట్ టైమ్ ల్యాప్‌టాప్ తీసుకునే వినియోగదారులు ఏసర్ ఆస్పైర్ గో 14 కొనుగోలు చేయొచ్చు. అత్యంత సరసమైన ధరలో ఏఐ ఆధారిత ల్యాప్‌టాప్ ఇదే.. ఈ ల్యాప్‌టాప్ విద్యార్థులతో పాటు సాధారణ యూజర్లకు అద్భుతంగా ఉంటుంది.
ఈ ఆస్పైర్ గో 14 ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 7 H-సిరీస్ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఇంటెల్ ఏఐ బూస్ట్ NPU కలిగి ఉంటుంది. ఏఐ పీసీ కంటెంట్, ఏఐ టూల్స్ త్వరగా యాక్సెస్ చేసేందుకు వీలుగా స్పెషల్ కోపైలట్ కీతో వస్తుంది.
ఈ ల్యాప్‌టాప్ చాలా తేలికగా ఉంటుంది. అల్యూమినియం ఛాసిస్, స్లిమ్ 17.5mm ప్రొఫైల్‌తో కేవలం 1.5 కిలోల బరువు ఉంటుంది. 16:10 యాస్పెక్ట్ రేషియోతో 14-అంగుళాల WUXGA IPS డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఏసర్ ఆస్పైర్ గో 14 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
వినియోగదారులు 32GB వరకు DDR5 ర్యామ్, 1TB వరకు PCIe జెన్ 3 SSD స్టోరేజ్‌తో కాన్ఫిగర్ చేయవచ్చు. ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ డివైజ్‌కు మరింత పవర్ అందిస్తుంది. రోజువారీ కంప్యూటింగ్ అవసరాలకు సపోర్టు ఇస్తుంది. ఈ ల్యాప్‌టాప్ Wi-Fi 6, బ్లూటూత్ 5.2 సపోర్టు ఇస్తుంది. ప్రైవసీ షట్టర్‌తో కూడిన HD వెబ్‌క్యామ్‌ను కలిగి ఉంది. 55Wh బ్యాటరీని కలిగి ఉంది. 65W USB-C ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
I/O పరంగా ల్యాప్‌టాప్‌లో రెండు USB 3.2 టైప్-A పోర్ట్‌లు, రెండు USB టైప్-C పోర్ట్‌లు (ఒకటి డిస్ప్లేపోర్ట్, పవర్ డెలివరీతో) సింగిల్ RJ45 ఈథర్నెట్ పోర్ట్ ఉన్నాయి. ఏసర్ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుధీర్ గోయెల్ మాట్లాడుతూ.. ఆస్పైర్ గో 14 ల్యాప్‌టాప్ ఏఐ కంప్యూటింగ్‌ను అందిస్తుందని అన్నారు.
సరసమైన ధరలో విద్యార్థులు, హోం యూజర్లు, యంగ్ ఎక్స్‌పర్ట్స్ నుంచి డిమాండ్ పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రీమియం ల్యాప్‌టాప్‌లకు ప్రత్యేకమైన ఏఐ ఫీచర్లతో ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌లో అందిస్తున్నామని చెప్పారు.
ధర ఎంతంటే? :
ఆస్పైర్ గో 14 ల్యాప్‌టాప్ ధర రూ. 59,999 నుంచి ప్రారంభమవుతుంది. ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, ఏసర్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ ఇండియా ద్వారా అందుబాటులో ఉంది.