Apple Retail Stores : ఢిల్లీ, ముంబై తర్వాత భారత్‌లో మరో 4 ఆపిల్ రిటైల్ స్టోర్లు రాబోతున్నాయి..!

Apple Retail Stores : ఆపిల్ ఉత్పత్తులకు భారత్ కేంద్రంగా మారుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ, ముంబైలలో మొదటి స్టోర్‌లు భారీ విజయాన్ని సాధించాయి. దాంతో ఆపిల్ మరో నాలుగు రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

After Delhi, Mumbai, Apple to open 4 more retail stores in India

Apple Retail Stores : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ భారత మార్కెట్లో రిటైల్ స్టోర్లను మరింతగా విస్తరించనుంది. దేశ రిటైల్ మార్కెట్లో కొత్తగా మరో 4 రిటైల్ ఆపిల్ స్టోర్లు రాబోతున్నాయి. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ,ముంబైలలో మొదటి రెండు ఫ్లాగ్‌షిప్ రిటైల్ స్టోర్లను ప్రారంభించిన ఆపిల్.. రాబోయే రోజుల్లో మరో నాలుగు రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Read Also : Fastag Balance Check : ఆన్‌లైన్‌లో ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ ఎలా చెక్ చేయాలో తెలుసా? రీఛార్జ్ చేసుకోండిలా..!

ఢిల్లీ, ముంబై రిటైల్ స్టోర్లకు కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో టెక్ దిగ్గజం ఇప్పుడు మరిన్ని రిటైల్ స్టోర్లను విస్తరించాలని భావిస్తోంది. భారత్ మార్కెట్లో ఆపిల్ ప్రీమియం ప్రో, ఐఫోన్ ప్రో ఐఫోన్ ప్రో మాక్స్ మోడల్‌లతో సహా మొత్తం ఐఫోన్ 16 లైనప్‌ను ఇక్కడే కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. వినియోగదారుల మార్కెట్, తయారీ కేంద్రంగా దేశంతో సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఏయే నగరాల్లో కొత్త ఆపిల్ స్టోర్‌లు రానున్నాయంటే? :
ఆపిల్ ఉత్పత్తులకు భారత్ కేంద్రంగా మారుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ, ముంబైలలో మొదటి స్టోర్‌లు భారీ విజయాన్ని సాధించాయి. దాంతో ఆపిల్ మరో నాలుగు రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. రాబోయే ఆపిల్ స్టోర్‌లు బెంగళూరు, పూణే, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది.

అంతేకాకుండా, ఆపిల్ ముంబైలో మరో స్టోర్‌ను కూడా ప్లాన్ చేస్తోంది. ప్రారంభంలోనే మొదటి రెండు స్టోర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. భారత్‌లో ఆపిల్ ఆదాయానికి ఈ రెండు స్టోర్‌లు గణనీయంగా దోహదపడ్డాయని నివేదిక పేర్కొంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. దేశంలోని ఆపిల్ వ్యాపారంలో ఢిల్లీ, ముంబై మాత్రమే ఐదవ వంతుకు పైగా ఉన్నాయి. విలాసవంతమైన గాడ్జెట్‌ల పట్ల భారత్ వినియోగదారుల్లో పెరుగుతున్న ఆసక్తి ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

భారత్‌లోనే ఐఫోన్ 16ను తయారు చేస్తోందా? :
ఆపిల్ ఇప్పుడు హై-ఎండ్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌తో సహా మొత్తం ఐఫోన్ 16 లైనప్‌ను భారత్ మార్కెట్లోనే ఉత్పత్తి చేస్తోంది. ఆపిల్, ఇండియా రెండింటికీ భారీ డీల్ అని చెప్పవచ్చు. ఇంతకుముందు, ఆపిల్ భారత్‌లో పాత ఐఫోన్ మోడల్‌లను మాత్రమే తయారు చేసింది. కానీ, ఇప్పుడు తమ లేటెస్ట్, అత్యంత ప్రీమియం ఫోన్లను కూడా తయారుచేసేందుకు ప్లాన్ చేస్తోంది.

ఈ ఐఫోన్లను తయారు చేయడానికి ఆపిల్ ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, టాటా ఎలక్ట్రానిక్స్‌తో భాగస్వామ్యం కలిగి ఉందని నివేదిక వెల్లడించింది. ఐఫోన్ 16, 16 ప్లస్, ఐఫోన్ ప్రో మాక్స్ మోడల్‌లకు ఫాక్స్‌కాన్ బాధ్యత వహిస్తుండగా, పెగాట్రాన్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రోలను నిర్వహిస్తోంది. టాటా ఎలక్ట్రానిక్స్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మోడల్‌లను కూడా తయారు చేయనుంది. ఈ ఐఫోన్లు భారత మార్కెట్లోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయనుంది.

Read Also : AC Cool Faster Tips : మీ ఏసీ ఫాస్ట్‌గా కూల్ కావాలన్నా.. కరెంట్ బిల్లు తగ్గాలన్నా.. ఈ 10 సింపుల్ టిప్స్ తప్పక పాటించండి!