Airtel-Vi OTT Plans _ Airtel and Vodafone-Idea plans with free Disney+ Hotstar_ Full list of plans, benefits
Airtel-Vi OTT Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన ఎయిర్‌టెల్ (Airtel), వోడాఫోన్ ఐడియా (Vodafone idea) తమ యూజర్ల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. అంతేకాదు.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లపై అదిరిపోయే ఓటీటీ (OTT Subscription) కూడా ఉచితంగా అందిస్తున్నాయి. ఇటీవలి ఏళ్లలో టెలికాం రంగంలో పోటీ గణనీయంగా పెరిగింది. Vodafone Idea (Vi), Airtel, (Reliance Jio) వంటి ప్రముఖ నెట్‌వర్క్ ప్రొవైడర్లు తమ వినియోగదారులకు అందించే ప్లాన్‌లపై మెరుగైన సర్వీసుల కోసం OTT సర్వీసులతో పాటు అదనపు బెనిఫిట్స్ అందిస్తున్నాయి.
అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, మొబైల్ డేటాను కూడా అందిస్తున్నాయి. ఇంతకుముందు డిస్నీ+ హాట్‌స్టార్‌కు ఫ్రీగా సబ్‌స్క్రిప్షన్ వంటి OTT బెనిఫిట్స్ అందించిన జియో ఇప్పుడు ఈ OTT సభ్యత్వాన్ని ప్రీపెయిడ్ ప్లాన్ నుంచి తొలగించింది. ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ఇప్పటికీ డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సభ్యత్వాన్ని అందిస్తున్నాయి.
వాస్తవానికి రెండు టెలికాం ఆపరేటర్లు డిస్నీ+ హాట్‌స్టార్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను మరిన్ని ప్రీపెయిడ్ Airtel లేదా Vi యూజర్లకు ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అన్‌లిమిటెడ్ డేటా, కాల్, SMS బెనిఫిట్స్ పొందవచ్చు. ఫ్రీ డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే అన్ని Airtel, Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఓసారి పరిశీలిద్దాం.
ఫ్రీ డిస్నీ+ హాట్‌స్టార్‌తో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే :
రూ. 399 ప్లాన్ :
ఈ ప్లాన్ రోజుకు 2.5GB డేటా, రోజుకు 100 ఉచిత SMSలు, 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్‌లను అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ కోసం ఎయిర్‌టెల్ యాప్, వెబ్ నుంచి రీఛార్జ్‌పై 3 నెలల పాటు ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది.
రూ. 499 ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ యాప్, వెబ్ నుంచి రీఛార్జ్‌పై రోజుకు 3GB డేటా, రోజుకు 100 ఉచిత SMSలు, 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్, 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.
Airtel-Vi OTT Plans _ Airtel and Vodafone-Idea plans with free Disney+ Hotstar
రూ. 719 ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 1.5GB రోజువారీ డేటా లిమిట్, రోజుకు 100 SMSలు, Airtel యాప్, వెబ్ నుంచి రీఛార్జ్‌పై 3 నెలల పాటు ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో 84 రోజుల పాటు కాలింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి.
రూ. 779 ప్లాన్ :
మునుపటి ప్లాన్ మాదిరిగానే.. ఈ ప్లాన్‌లో 1.5GB రోజువారీ డేటా లిమిట్, రోజుకు 100 SMSలు, Airtel యాప్, Web నుంచి రీఛార్జ్‌పై 3 నెలల పాటు ఉచిత Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్‌తో 90 రోజుల పాటు కాలింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి.
రూ. 839 ప్లాన్:
ఈ రీఛార్జ్ ప్లాన్ కింద వినియోగదారులు 2GB రోజువారీ డేటా లిమిట్, రోజుకు 100 SMSలు, 3 నెలల పాటు ఫ్రీగా Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్‌తో 84 రోజుల పాటు కాలింగ్ బెనిఫిట్స్ పొందుతారు.
రూ. 999 ప్లాన్ :
ఈ రీఛార్జ్‌లో 2.5GB రోజువారీ డేటా లిమిట్, రోజుకు 100 SMS, 3 నెలల పాటు ఫ్రీగా Disney+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో 84 రోజుల పాటు కాలింగ్ బెనిఫిట్స్, Amazon Prime కోసం ఫ్రీగా సభ్యత్వం కూడా పొందవచ్చు.
రూ. 3359 ప్లాన్ : ఈ వార్షిక ప్లాన్‌తో, Airtel 2.5GB రోజువారీ డేటా లిమిట్, రోజుకు 100 SMSలు, 1 ఏడాది పాటు ఫ్రీగా Disney+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో 365 రోజుల పాటు కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది. Amazon Prime వీడియో మొబైల్ ఎడిషన్ ఫ్రీగా మెంబర్‌షిప్ కూడా అందిస్తుంది.
ఫ్రీగా డిస్నీ+ హాట్‌స్టార్‌తో Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లివే :
రూ. 151 ప్లాన్ :
ఈ ప్లాన్‌లో, Vi 30 రోజుల వ్యాలిడిటీతో 8GB డేటా, యాక్టివ్ ప్యాక్ వ్యాలిడిటీతో 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీగా సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
రూ. 399 ప్లాన్ :
ఈ ప్లాన్ 28 రోజుల ప్యాక్ వ్యాలిడిటీతో 2.5GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్, 3 నెలల డిస్నీ హాట్‌స్టార్ మొబైల్‌ను ఉచితంగా అందిస్తుంది.
రూ. 499 ప్లాన్ :
3GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్, 3 నెలల ఉచిత డిస్నీ హాట్‌స్టార్ మొబైల్ 28 రోజుల ప్యాక్ వ్యాలిడిటీ అందిస్తుంది.
రూ. 601 ప్లాన్ :
వినియోగదారులు 3GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్, 1 ఏడాదిపాటు ఉచిత డిస్నీ హాట్‌స్టార్ మొబైల్, 28 రోజుల ప్యాక్ వ్యాలిడిటీతో అదనపు 16GB డేటాను పొందవచ్చు.
రూ. 901 ప్లాన్ :
ఈ ప్లాన్ కింద యూజర్లు 3GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఒక ఏడాది ఉచిత డిస్నీ హాట్‌స్టార్ మొబైల్, 70 రోజుల ప్యాక్ వ్యాలిడిటీతో అదనపు 48GB డేటా పొందవచ్చు.
రూ. 1066 ప్లాన్ :
ఈ ప్లాన్ 84 రోజుల ప్యాక్ వ్యాలిడిటీతో 2GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్, 1 ఏడాది ఉచిత డిస్నీ హాట్‌స్టార్ మొబైల్‌ని అందిస్తుంది.
రూ. 3099 ప్లాన్ :
ఈ వార్షిక ప్లాన్ యూజర్లకు 2GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఒక ఏడాది ఉచిత డిస్నీ హాట్‌స్టార్ మొబైల్, 365 రోజుల ప్యాక్ వ్యాలిడిటీతో అదనపు 75GB డేటాను అందిస్తుంది.