Samsung Huge Discounts : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.. ఫీచర్లు అదుర్స్.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?
Samsung Huge Discounts : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ సిరీస్‌లో S23 Ultra, గెలాక్సీ S23 Plus, గెలాక్సీ S23లను ఫిబ్రవరిలో లాంచ్ చేసింది.

Samsung offering huge discounts on Galaxy S23 Ultra, Galaxy S23 Plus and the Galaxy S23
Samsung Huge Discounts : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ సిరీస్‌లో S23 Ultra, గెలాక్సీ S23 Plus, గెలాక్సీ S23లను ఫిబ్రవరిలో లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ S23 Ultra మోడల్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, కెమెరా సామర్థ్యాలపై గెలాక్సీ S23 Plus, Galaxy S23 స్టైల్, ఫంక్షనాలిటీతో వచ్చాయి. మీరు శాంసంగ్ గెలాక్సీ S23ని కొనుగోలు చేయాలనుకుంటే.. శాంసంగ్ కంపెనీ రూ. 18వేల వరకు ఆఫర్లను అందిస్తోంది. ఈ సిరీస్‌లో అత్యంత ప్రీమియం డివైజ్ సరికొత్త గెలాక్సీ S23 Ultra స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం శాంసంగ్ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది.
కస్టమర్లు నో-కాస్ట్ 12 నెలల EMI ఆప్షన్‌తో పాటు రూ. 18వేల విలువైన బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఆఫర్ ఆసక్తిగల కొనుగోలుదారులు తక్కువ ధరకే Galaxy S23 Ultra సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 200MP ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంది. తక్కువ-కాంతి ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. శాంసంగ్ ‘నైటోగ్రఫీ’గా పిలుస్తోంది. 24 నెలల EMI ఆప్షన్ అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు ఈ ఫోన్ వేరియంట్ నెలకు రూ. 5,209 (EMI) చెల్లించి కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ కొత్త Galaxy S23 Ultra మోడల్‌ను పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా కస్టమర్లకు రూ. 10వేల స్పెషల్ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ ధరను మరింత తగ్గిస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులకు మరింత అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ S23 ప్లస్, S23 మోడల్‌లు ప్రస్తుతం రూ. 13వేల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది.

Samsung offering huge discounts on Galaxy S23 Ultra, Galaxy S23 Plus
12 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్‌తో అందుబాటులో ఉన్నాయి. 24-నెలల నో-కాస్ట్ EMI ప్లాన్ కోసం నెలకు రూ. 3,125 నుంచి ప్రారంభించి, కస్టమర్లు రూ. 8వేల అప్‌గ్రేడ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. శాంసంగ్ స్మార్ట్ఫోన్లను ఈ డిస్కౌంట్ ఆఫర్లతో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్ల ధర, ఫీచర్లు ఇవే :
శాంసంగ్ గెలాక్సీ S23 మూడు వేరియంట్లలో వస్తోంది. 8GB RAM + 128GB స్టోరేజీ, 8GB RAM + 256GB స్టోరేజీ, 8GB RAM + 512GB స్టోరేజీ. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.74,999తో అందుబాటులో ఉంది. శాంసంగ్Galaxy S23 Plus రెండు వేరియంట్లలో మాత్రమే వస్తుంది.
అందులో 8GB RAM + 256GB స్టోరేజీ, 8GB RAM+ 512GB స్టోరేజీ ఉన్నాయి. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.94,999 నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా, గెలాక్సీ S23 Ultra ప్రారంభ ధర 128GB వేరియంట్‌కు రూ. 124999, 256GB ధర రూ. 134,999, 512GB ధర రూ. 154999లకు అందుబాటులో ఉన్నాయి.