Airtel Prepaid Price Hike : ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. ప్రీ‌పెయిడ్ ఛార్జీల పెంపు..!

ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్ టెల్ తమ యూజర్లకు భారీ షాకిచ్చింది. ప్రీపెయిడ్ టారిఫ్ ఛార్జీలను ఒక్కసారిగా పెంచేసింది. టారిఫ్ రేట్లను పెంచేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Airtel Prepaid Price Hike : ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్ టెల్ తమ యూజర్లకు భారీ షాకిచ్చింది. ప్రీపెయిడ్ టారిఫ్ ఛార్జీలను ఒక్కసారిగా పెంచేసింది. టారిఫ్ రేట్లను పెంచేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్‌ టారిఫ్‌ను 20 నుంచి 25 శాతం, డాటా టాప్‌ అప్‌ ప్లాన్‌ల మీద 20 నుంచి 21 శాతం పెంచేసింది. ప్రతీ ప్యాక్‌ మీద రూ. 10 మినిమమ్‌ టారిఫ్ పెంపును ప్రకటించింది. ఆరోగ్యకరమైన ఆర్థిక పోటీలో భాగంగానే ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ సోమవారం ప్రకటించింది. 28 రోజుల వాలిడిటీతో మినిమమ్‌ టారిఫ్‌.. ప్రస్తుతం రూ.79గా ఉంది. ఇప్పుడు ఈ టారిఫ్ రేటు రూ. 99 కానుంది.

డాటా టాప్‌ అప్స్‌ (Data Top-up)లో రూ. 48 అన్‌లిమిటెడ్‌ 3GB డాటా ప్యాక్‌ను రూ. 58లకు పెంచేసింది. నవంబర్‌ 26 నుంచి పెరిగిన ఈ కొత్త టారిఫ్ ధరలు ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు వర్తించనున్నాయి. భ‌విష్య‌త్ పెట్టుబ‌డులతో పాటు 5G సేవ‌ల ప్రారంభం వంటి అంశాల‌కు ఛార్జీల స‌వ‌ర‌ణ త‌ప్ప‌నిస‌రిగా కంపెనీ పేర్కొంది. యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌(ARPU) కింద రూ. 200 నుంచి రూ. 300 అవుతోందని తెలిపింది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే టారిఫ్‌లను పెంచాల్సి వచ్చిందని భారతీ ఎయిర్‌టెల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. టెలికామ్‌ పరిశ్రమ ముందుకు వెళ్లాలంటే డేటా టారిఫ్‌లను పెంచకతప్పదని భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ ఆగస్టులోనే సంకేతాలు ఇచ్చారు. లేటెస్ట్ టారిఫ్‌ పెంపుపై సోషల్‌ మీడియాలో #Airtel మీద మీమ్స్‌ వైరల్ అవుతున్నాయి.

యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌(ARPU) కింద 200 నుంచి 300 రూపాయ‌లు అవుతోందని, ఈ లెక్కన ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే టారిఫ్‌లను పెంచక తప్పలేదని భారతీ ఎయిర్‌టెల్‌ స్పష్టం చేసింది. టారిఫ్ పెంపు మౌలిక సదుపాయాలలో “గణనీయమైన పెట్టుబడులకు మార్గం వేస్తుంద‌ని, భారతదేశంలో 5G స్పెక్ట్రమ్‌ను విడుదల చేయడంలో సహాయపడుతుందని సోమవారం ఓ ప్రకటన ఎయిర్‌టెల్ వెల్ల‌డించింది. టారిప్ పెంపు ప్ర‌క‌ట‌న‌తో స్టాక్ మార్కెట్లో ఎయిర్ టెల్ షేర్లు అమాంతం పెరిగిపోయాయి. ఇతర టెలికం పోటీదారుల్లో ఒకటి అయిన వోడాఫోన్ ఐడియా కూడా ఎయిర్ టెల్ త‌ర‌హాలో ఛార్జీలు పెంచనున్నట్టు సమాచారం.

Read Also : iPhone USB Type-C : ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జర్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు