Airtel New Prepaid Plan : ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్.. ఈ బెనిఫిట్స్ డోంట్ మిస్!

ఎయిర్‌టెల్ భారతీయ యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది.. అదే. కొత్త రూ.79 ప్లాన్.. ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.49 ప్యాక్ స్థానంలో ఈ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. డేటాతో పాటు ఔట్ గోయింగ్ కాల్స్ పొందవచ్చు.

Airtel New Prepaid Plan : ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్.. ఈ బెనిఫిట్స్ డోంట్ మిస్!

Airtel Introduces New Rs 79 Prepaid Plan In Place Of Rs 49 Pack

Updated On : July 28, 2021 / 4:39 PM IST

Airtel new Rs 79 prepaid Plan : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ భారతీయ యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది.. అదే. కొత్త రూ.79 ప్లాన్.. ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.49 ప్యాక్ స్థానంలో ఈ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. డేటాతో పాటు ఔట్ గోయింగ్ కాల్స్ పొందవచ్చు. ఇటీవలే ఎయిర్ టెల్ తమ పోస్ట్ పెయిడ్ ప్లాన్లను అప్ గ్రేడ్ చేసింది. అలాగే రిటైల్ ఆఫర్లను కూడా అప్ డేట్ చేసింది.

ఎయిర్ టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ.79లో ఏయే బెనిఫిట్స్ ఉన్నాయంటే.. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే రూ.64 టాక్ టైమ్ వస్తుంది. ఔట్ గోయింగ్ కాల్స్ 106 నిమిషాలు ఆఫర్ చేస్తోంది. లోకల్, STD కాల్స్ పై సెకనుకు ఒక పైసా చార్జ్ చేస్తుంది. ప్రీపెయిడ్ ప్యాక్ లో 4G డేటా 200MB వరకు ఆఫర్ చేస్తోంది. 28 రోజుల వరకు ప్లాన్ వ్యాలిడీటీ ఉంటుంది. ఎంట్రీ లెవల్ ప్లాన్లలో ఎయిర్ టెల్ తమ కస్టమర్లకు అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ కొత్త రూ.79 ప్లాన్ మంగళవారం (జూలై 29) నుంచి అందుబాటులోకి రానుంది. అలాగే రూ.49 ప్యాక్ నిలిచిపోనుంది. ఈ ప్యాక్ పై టాక్ టైమ్ రూ.38.52 పైసలు, 100MB డేటా, 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. లోకల్, STD కాల్స్ పై సెకనుకు 2.5 పైసా చార్జ్ చేస్తోంది.

భారత మార్కెట్లో ఎయిర్ టెల్ ఇటీవలే కొత్త పోస్టు పెయిడ్ ప్లాన్లను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో వరుసగా రూ.299, రూ.349, రూ.399, రూ.499, రూ.1,599 ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్లన్నీ 30 రోజుల వ్యాలిడీటీతో అందిస్తోంది. రూ.299 ప్లాన్, రూ.249 ప్లాన్ లలో 30GB డేటా, 40GB డేటాను ఆఫర్ చేస్తోంది. అంతేకాదు.. అన్ లిమిటెడ్ కాల్స్, Airtel Call Manager business tool, Wynk Music, Artel Xstream Premium సర్వీసులను కూడా యాక్సస్ చేసుకోవచ్చు. Shaw Academy ఒక ఏడాది సబ్ స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు. ఇక రూ.399, రూ.499, రూ.1,599 ప్లాన్లలో 60GB, 100GB, 500GB డేటా వరకు ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్లపై ఏడాదిపాటు Amazon Prime, Disney+ Hotstar VIP subscription కూడా అందిస్తోంది.