Airtel, Jio 5G now available on iPhone 12 and above_ How to activate
iPhone 5G Services : ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) యూజర్లకు అలర్ట్.. భారత మార్కెట్లో iPhone యూజర్లు iOS 16.2 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పొందవచ్చు. ఐఫోన్ 12 మోడల్ సహా ఆపై అడ్వాన్స్ ఐఫోన్ మోడళ్లలో 5G సర్వీసులను యాక్సస్ చేసుకోవచ్చు. ఈ కొత్త అప్‌డేట్ iPhone SE 3 (2022)తో పాటు iPhone 12, iPhone 13, iPhone 14 సిరీస్‌లలో 5G కనెక్టివిటీని పొందవచ్చు.
భారత మార్కెట్లో Airtel, Reliance Jio నెట్‌వర్క్‌లు ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే 5G సర్వీసులను ఉచితంగా అందిస్తున్నాయి. ఐఫోన్‌లలో 5Gని యాక్టివేట్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. కానీ, వినియోగదారులకు 5G ప్లాన్ల ధర ఎంత ఉంటాయి? ఎలా సెటప్ చేసుకోవాలి అనేదానిపై అనేక సందేహాలు ఉండొచ్చు. భారత్‌లోని మొబైల్ వినియోగదారులు తమ iPhoneలలో 5G సర్వీసులను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
iPhoneలలో 5Gని ఎలా యాక్టివేట్ చేయాలంటే? :
5G స్పీడ్ వినియోగించాలంటే.. ఐఫోన్ యూజర్లు iOS వెర్షన్ 16.2లో మాత్రమే ఉండాలి. లేటెస్ట్ అప్‌డేట్ వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. Settings > Mobile Data > Mobile Data Options > Voice and Data > 5G or 5G Auto ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా 5G సర్వీసులను యాక్టివేట్ చేసుకోవచ్చు. 5Gని ఉపయోగించడం ద్వారా బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందని గమనించాలి.
పవర్ ఆదా చేయడంలో సాయపడేందుకు 5G ఆటో ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. Jio వినియోగదారులు 5G స్టాండలోన్ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. 5G పూర్తి సామర్థ్యాన్ని పొందవచ్చు. ఎయిర్‌టెల్ నాన్-స్టాండలోన్ 5Gని ఉపయోగిస్తోంది. ఇప్పటికే ఉన్న 4G నెట్‌వర్క్‌పై ఆధారపడి పనిచేస్తుంది.
Airtel, Jio 5G now available on iPhone 12 and above_ How to activate
దేశంలో 5G ఏయే నగరాల్లో ఉందంటే? :
ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి, పానిపట్, గురుగ్రామ్, గౌహతి, పాట్నాలలో 5G సర్వీసులు అందుబాటులో ఉన్నాయని ఎయిర్‌టెల్ తెలిపింది. మరోవైపు, Reliance Jio కూడా తమ 5G సర్వీసులు ఢిల్లీ-NCR, ముంబై, కోల్‌కతా, వారణాసి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణె, నాథ్‌ద్వారా, గుజరాత్ (33 జిల్లాలు)లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. వోడాఫోన్ ఐడియా (Vi) భారత మార్కెట్లో తన 5G సర్వీసులను ఇంకా రిలీజ్ చేయలేదు.
Airtel, Jio 5G now available on iPhone 12 and above_ How to activate
మీకు 5G స్పీడ్ గురించి ఆసక్తి ఉంటే.. దక్షిణ ఢిల్లీలో Airtel 5G ప్లస్‌ని ఉపయోగించవచ్చు. 5G టెస్టు సమయంలో.. డౌన్‌లోడ్ స్పీడ్ 297Mbps వరకు ఉంటే.. సగటు 4G స్పీడ్ (20Mbps) కన్నా మెరుగ్గా ఉంది. రిలయన్స్ జియో 5Gని ఎంపిక చేసిన కస్టమర్లతో టెస్టింగ్ చేస్తోంది. ఇప్పటికే అర్హత కలిగిన తమ వినియోగదారులకు ఇన్విటేషన్లను కూడా పంపుతోంది. iPhoneలో Jio 5G స్పీడ్ ఎంత అనేది కంపెనీ ఇంకా ట్రయల్స్ నిర్వహించలేదని ఓ నివేదిక తెలిపింది.
దేశంలో Airtel – Jio 5G ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో ఎయిర్‌టెల్, జియో 5G సర్వీసులు ఉచితంగానే టెస్టింగ్ చేయడం జరిగింది. కొత్త SIM కార్డ్‌ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని యూజర్లు గమనించాల్సి ఉంటుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..