Apple iPhones 5G Update : ఆపిల్ యూజర్లకు అలర్ట్.. ఐఫోన్లలో 5G సపోర్ట్ అప్‌డేట్.. అందరికి కాదండోయ్.. వారికి మాత్రమే!

Apple iPhones 5G Update : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) సొంత బ్రాండ్ ఐఫోన్లలో లేటెస్ట్ iOS 16.2 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. భారత మార్కెట్లో iPhoneలలో 5Gకి సపోర్టు ఆపిల్ అందిస్తుంది. 5G-సపోర్టెడ్ iPhoneని కలిగి ఉన్న యూజర్లకు ఈ కొత్త అప్‌డేట్ అందుబాటులోకి రానుంది.

Apple iPhones 5G Update : ఆపిల్ యూజర్లకు అలర్ట్.. ఐఫోన్లలో 5G సపోర్ట్ అప్‌డేట్.. అందరికి కాదండోయ్.. వారికి మాత్రమే!

Apple is rolling out 5G support update for iPhones, but not everyone can avail it right away

Apple iPhones 5G Update : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) సొంత బ్రాండ్ ఐఫోన్లలో లేటెస్ట్ iOS 16.2 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. భారత మార్కెట్లో iPhoneలలో 5Gకి సపోర్టు ఆపిల్ అందిస్తుంది. 5G-సపోర్టెడ్ iPhoneని కలిగి ఉన్న యూజర్లకు ఈ కొత్త అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. లేటెస్ట్ నెట్‌వర్క్‌ పొందాలంటే ఈ అప్‌డేట్ iOS బీటా వెర్షన్‌ పొందవచ్చు. ఆపిల్ మొదట iOS 16.2 బీటా అప్‌డేట్‌ను అందిస్తోంది. ప్రతి ఒక్కరూ వెంటనే 5Gని పొందలేరని గుర్తించుకోండి. బీటా-యేతర టెస్టులకు స్థిరమైన వెర్షన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. 5G అప్ డేట్ రిలీజ్ చేయడానికి ముందుగా ఏదైనా బగ్‌లు లేదా ఇతర సమస్యలు ఉన్నాయా అనేది చెక్ చేసేందుకు ముందుగా బీటా అప్‌డేట్‌ను రిలీజ్ చేయనుంది. చిన్న గ్రూపు ఐఫోన్ యూజర్లకు మాత్రమే ఈ 5G అప్ డేట్ అందుబాటులోకి రానుంది. అంతా సరిగ్గా ఉంటే.. ఐఫోన్ యూజర్ల అందరికి కొత్త 5G అప్‌డేట్ అందుబాటులోకి రానుంది.

Apple is rolling out 5G support update for iPhones, but not everyone can avail it right away

Apple is rolling out 5G support update for iPhones, but not everyone can avail it right away

Apple డిసెంబర్‌లో లేటెస్ట్ 5G సపోర్ట్ అప్‌డేట్‌ను లాంచ్ చేయనుంది. ఐఫోన్ యూజర్లందరికి వచ్చే నెలలోపు ఈ 5G అప్‌డేట్ వస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది. ఏదైనా సందర్భంలో కొత్త అప్‌డేట్ అందించడానికి కంపెనీ సాధారణంగా ఒక నెల లేదా అంతకంటే తక్కువ సమయం పడుతుంది. లేటెస్ట్ అప్‌డేట్ Jio, Airtel 5Gకి సపోర్టు అందిస్తుంది. ఐఫోన్ యూజర్లలో స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌ల విభాగంలో రెండు 5G మోడ్‌లను పొందవచ్చు. అందులో 5G On మోడ్ ఉంది. ఈ డివైజ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటుంది. iPhone ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తుంది.

Apple is rolling out 5G support update for iPhones, but not everyone can avail it right away

Apple is rolling out 5G support update for iPhones, but not everyone can avail it right away

రెండవ ఆప్షన్ 5G Auto ద్వారా డివైజ్ ఆటోమాటిక్‌గా ఏ ప్రాంతంలో అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌కు మారడానికి సాయపడుతుంది. లేటెస్ట్ iOS బీటా అప్‌డేట్ ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే.. ఎక్కువ బ్యాటరీని వినియోగించదు. అప్పుడు మాత్రమే రెండవ ఆప్షన్ 5Gకి మారుతుంది. మీరు బీటా అప్‌డేట్‌ను అందుకున్న తర్వాత కూడా 5Gని యాక్సెస్ చేసుకోలేకపోతే.. మీ ప్రాంతంలో 5G నెట్‌వర్క్‌కు సపోర్టు చేస్తుందో లేదో చెక్ చేయాలి. Jio 5G ప్రస్తుతం వారణాసి, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, అలాగే నాగ్‌పూర్‌లలో కూడా Airtel 5G సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Realme 10 Series : అద్భుతమైన కెమెరాలతో రియల్‌మి 10 సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?