Airtel Recharge Plan
Airtel Recharge : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. భారతీ ఎయిర్‌టెల్ తమ మిలియన్ల మంది యూజర్ల కోసం వినూత్న రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ ఈ ప్రత్యేకమైన ఆఫర్ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్ (IR)గా అందిస్తోంది.
ఈ ‘ఆల్ ఇన్ వన్’ రీఛార్జ్ ప్లాన్ ద్వారా భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 189 దేశాలలో కూడా యాక్సస్ చేయొచ్చు. మొత్తం 365 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ యూజర్లకు ట్రావెలింగ్ సమయంలో విమానాల్లో సహా దేశీయంగా, అంతర్జాతీయంగా కాలింగ్, డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.
రూ. 4వేల ధరతో ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ యూజర్లకు 189 దేశాలలో అంతర్జాతీయ రోమింగ్‌ను అందిస్తోంది. ఇందులో అంతర్జాతీయ వినియోగానికి 100 నిమిషాల ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్‌తో పాటు 5GB డేటా పొందవచ్చు.
అదనంగా, సబ్‌స్క్రైబర్‌లు విమానంలో కనెక్టివిటీ బెనిఫిట్స్ కూడా పొందుతారు. విమానంలో ఉన్నప్పుడు 250MB డేటాను అందిస్తుంది. అయితే, ఎంపిక చేసిన విమానయాన సంస్థలలో మాత్రమే విమానంలో కనెక్టివిటీ అందుబాటులో ఉంటుందని గమనించాలి.
365 రోజులు అన్‌లిమిటెడ్ కాలింగ్ :
దేశీయంగా, ఎయిర్‌టెల్ ప్లాన్ మొత్తం 365 రోజులలో అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది. వినియోగదారులు ఫ్రీ నేషనల్ రోమింగ్ సౌలభ్యాన్ని పొందవచ్చు. ప్రతిరోజూ 1.5GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. ఇంకా, ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ పొందవచ్చు. ఈ ఆఫర్ ప్రత్యేకంగా ఎక్కువగా ట్రావెలింగ్ చేసేవారికి ఉపయోగపడుతుంది. 189 దేశాలలో వారికి కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది.
ఎయిర్‌టెల్ యూజర్ల డిమాండ్లను తీర్చేందుకు కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త రూ. 451 రీఛార్జ్ డేటాను మాత్రమే కాకుండా జియోహాట్‌స్టార్‌కు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. 30 రోజుల పాటు అందించే ఈ ప్లాన్ వినియోగదారులకు 50GB డేటాతో జియోహాట్‌స్టార్‌కు ఫ్రీగా 3 నెలల సభ్యత్వాన్ని అందిస్తోంది. ఈ ఆఫర్ ప్రత్యేకంగా క్రికెట్ అభిమానుల కోసం తీసుకొచ్చింది. ఐపీఎల్ ఔత్సాహికులు ఈ ప్లాన్ ద్వారా క్రికెట్ మ్యాచ్ స్ట్రీమింగ్ ఎంజాయ్ చేయొచ్చు.
గతంలో, కంపెనీ రూ.100, రూ.195 ధరలతో రెండు అదనపు డేటా వోచర్‌లను ప్రవేశపెట్టింది. రూ.100 ప్లాన్‌లో 5GB డేటా, జియోహాట్‌స్టార్ మొబైల్‌కు 30 రోజుల సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అయితే, రూ.195 ప్లాన్‌లో 3 నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 15GB డేటాను అందిస్తుంది.