Airtel Offers : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రోజుకు రూ.10కే ఫ్రీ కాల్స్.. 2జీబీ డేటా కూడా.. 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు!

Airtel Offers : ఎయిర్‌టెల్ 365 రోజుల వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లపై అన్‌లిమిటెడ్ కాలింగ్, హై-స్పీడ్ డేటా, ఫ్రీ ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు.

Airtel Offers

Airtel Offers : ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? ఏ ప్లాన్ తీసుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం టెలికం మార్కెట్లో దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది.

అందులో ప్రధానంగా ఎయిర్‌టెల్ 365 రోజుల దీర్ఘకాలిక వ్యాలిడిటీతో 3 రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లలో ఒకటి ప్రత్యేకంగా వాయిస్ కాల్స్ కోసం తీసుకొచ్చింది. ఇందులో ఎలాంటి డేటా ఇవ్వదు అనమాట.

Read Also : Astro Tips : మీకు నిరుద్యోగ సమస్యలా? ఈ 7 పరిహారాలు చేయండి చాలు.. మీరు కోరుకున్న జాబ్ వస్తుంది..!

అదనంగా, ఎయిర్‌టెల్ 365-రోజుల ప్లాన్‌ అందిస్తోంది. దాంతో వినియోగదారులకు దీర్ఘకాలిక వ్యాలిడిటీతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. అంటే.. రోజుకు రూ.10కే ఫ్రీ కాల్స్, 2జీబీ డేటాను పొందవచ్చు.

దేశంలో రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఎయిర్‌టెల్ 380 మిలియన్లకు పైగా రోజువారీ యాక్టివ్ వినియోగదారులను కలిగి ఉంది. ఈ దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్‌లతో వినియోగదారులు ఏడాది పొడవునా తమ ఫోన్‌లను రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా కాల్స్, డేటా ఎంజాయ్ చేయొచ్చు.

ఎయిర్‌టెల్ 365 రోజుల ప్లాన్ :
ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. వినియోగదారులు భారత్ అంతటా ఏ నంబర్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ఫ్రీ నేషనల్ రోమింగ్ కూడా ఉంటుంది. ఇంకా, ఈ రీఛార్జ్ ప్యాకేజీలో భాగంగా రోజువారీ 2జీబీ హై-స్పీడ్ డేటా, 100 ఫ్రీ ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది.

ఈ ప్లాన్‌లో ఆకర్షణీయమైంది ఏమిటంటే.. 5జీ స్మార్ట్‌ఫోన్‌లను కలిగిన వినియోగదారులకు అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది. అదనంగా, యూజర్లు ఎయిర్‌టెల్ ఫ్రీ సర్వీసుల నుంచి బెనిఫిట్స్ పొందుతారు. ఈ ప్లాన్‌తో పాటు ఎయిర్‌టెల్ రూ. 3,999 ధరకు మరో ఆప్షన్ కలిగి ఉంది. ఇందులో 365 రోజుల వ్యాలిడిటీ కూడా ఉంటుంది. అదనపు డేటాతో పాటు జియోహాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్ అందిస్తోంది.

Read Also : Personal Finance : కేవలం రూ. 250 పెట్టుబడితో లక్షలు సంపాదించిపెట్టే సూపర్ స్కీమ్స్ ఇవే.. భవిష్యత్తులో డబ్బుకు డోకా ఉండదు!

రూ.3,999 రీఛార్జ్ ప్లాన్‌ :
ఎయిర్‌టెల్ యూజర్లు భారత్ అంతటా ఏ నంబర్‌కైనా అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్, 2.5జీబీ రోజువారీ హై-స్పీడ్ డేటాతో పాటు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ పొందుతారు. రూ.3,599 ప్లాన్ మాదిరిగానే, ఈ ప్రీపెయిడ్ ఆప్షన్ కూడా 5జీ స్మార్ట్‌ఫోన్‌లను కలిగిన యూజర్లకు అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది.