Airtel Recharge Plans
Airtel Recharge Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. ఎయిర్‌టెల్ తమ ప్రీపెయిడ్ యూజర్ల కోసం రూ.వెయ్యి లోపు అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. అన్‌లిమిటెడ్ (Airtel Recharge Plans) కాలింగ్, డేటా, మెసేజింగ్ బెనిఫిట్స్‌తో పాటు OTT బెనిఫిట్స్ పొందవచ్చు. రూ.100 నుంచి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో JioHotstar సబ్‌స్క్రిప్షన్, 5GB డేటాను పొందవచ్చు.
ఈ ప్లాన్‌కు ఎలాంటి కాలింగ్ బెనిఫిట్స్ ఉండవు. రోజువారీ డేటా బెనిఫిట్స్‌తో పాటు రూ.398, రూ.449, రూ.598, రూ.838 ప్లాన్లపై OTT ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తుంది. OTT బెనిఫిట్స్, రోజువారీ డేటా లిమిట్ అందించే రూ.1,000 లోపు ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఓసారి లుక్కేయండి.. ఏ ప్లాన్ కావాలో మీరే ఎంచుకోండి..
ఎయిర్‌టెల్ రూ. 398 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ 398 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రోజుకు 2GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ లోకల్, STD, రోమింగ్ కాల్స్, 30 రోజుల వ్యాలిడిటీతో JioHotstar సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు రూ.449 రీఛార్జ్ ప్లాన్ ద్వారా OTT బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఆసక్తిగల యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, 3GB రోజువారీ డేటా లిమిట్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం (Airtel Xstream Play Premium) ద్వారా 22+ OTTS యాక్సెస్ పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ. 598 రీఛార్జ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ రీఛార్జ్ (Airtel Recharge Plans) ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సబ్‌స్క్రిప్షన్‌తో కావాలంటే రూ. 598 రీఛార్జ్ ప్లాన్ తీసుకోండి. జియో హాట్‌స్టార్ సూపర్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ యాక్సెస్ పొందవచ్చు. ఈ ప్లాన్ కొనుగోలుపై రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 838 ప్రీపెయిడ్ ప్లాన్ :
రూ.838 రీఛార్జ్ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. 56 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు రోజుకు 3GB డేటా బెనిఫిట్స్, అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ. 979 రీఛార్జ్ ప్లాన్ :
OTT బెనిఫిట్స్ ఉండి లాంగ్ టైమ్ రీఛార్జ్ ప్లాన్ కావాలంటే.. ఎయిర్‌టెల్ అందించే రూ. 979 రీఛార్జ్ ప్లాన్ తీసుకోండి.. 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ (Xstream Play) ప్లే ప్రీమియం ద్వారా 22కి పైగా OTT ప్లాట్‌ఫామ్‌లను యాక్సస్ చేయొచ్చు. అలాగే, రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు.