Airtel vs Jio vs Vi : రూ. 500లోపు బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లివే.. OTT బెనిఫిట్స్..!

Airtel vs Jio vs Vi : మొబైల్ ఫోన్ యూజర్లకు అలర్ట్.. దేశీయ టెలికం దిగ్గజాలైన ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా తమ యూజర్ల కోసం బెస్ట్ రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి.

Airtel vs Jio vs Vi : మొబైల్ ఫోన్ యూజర్లకు అలర్ట్.. దేశీయ టెలికం దిగ్గజాలైన ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా తమ యూజర్ల కోసం బెస్ట్ రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. అందులోనూ ప్రత్యేకించి ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. Airtel, Jio, Vodafone Idea (Vi) రూ. 500లోపు ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అందులో కొన్ని బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లను సేకరించి మీకోసం అందిస్తున్నాం.. ఈ ప్లాన్లలో మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా కొన్ని OTT బెనిఫిట్స్  కూడా పొందవచ్చు. అయితే, వాటిలో కొన్ని అన్‌లిమిటెడ్ కాల్, డేటా బెనిఫిట్స్ మాత్రమే అందిస్తాయి. మీరు కూడా ఇలాంటి రీఛార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నట్టయితే ఓసారి ఈ ప్లాన్లపై లుక్కేయండి..

Airtel రూ. 499, రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ :
రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్ OTT బెనిఫిట్స్‌తో వస్తుంది. కస్టమర్‌లు ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్, అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ఏదైనా నెట్‌వర్క్‌కు అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 2GB రోజువారీ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. Airtel ఫాస్ట్‌ట్యాగ్, షా అకాడమీ, మరిన్నింటిపై రూ. 100 క్యాష్‌బ్యాక్‌ను కూడా ఆఫర్ చేస్తుంది. తక్కువ ధర ప్లాన్లలో రూ. 399 ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ అదే బెనిఫిట్స్ అందిస్తుంది. అయితే మీరు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్‌ను ఒక ఏడాదికి బదులుగా 3 నెలలు మాత్రమే పొందవచ్చు. ఇందులో ఎక్కువ డేటాను పొందవచ్చు. రోజుకు 2.5GB డేటాను పొందవచ్చు. మిగిలిన బెనిఫిట్స్ ఒకే విధంగా ఉంటాయి.

Best Prepaid Recharge Plans

జియో రూ. 499, రూ. 299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు :
రిలయన్స్ జియో రోజుకు 2GB డేటా, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. యూజర్లు ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలను కూడా పొందుతారు. ప్రతి జియో ప్రీపెయిడ్ JioTV, JioCinema వంటి యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మీకు OTT సబ్‌స్క్రిప్షన్ వద్దనుకుంటే.. మీరు రూ. 499 ప్యాక్‌తో పొందే అదే బెనిఫిట్స్ పొందవచ్చు. రూ. 299 జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ట్రై చేయవచ్చు.

Vi రూ. 319, రూ. 359 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు :
వోడాఫోన్ ఐడియా (Vi)లో రూ. 319 ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తోంది. ఇందులో రోజుకు 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 100 SMSలను పొందవచ్చు. ఎలాంటి OTT బెనిఫిట్స్ పొందలేరు. మీకు ఏదీ అవసరం లేదంటే.. ఈ ప్రీపెయిడ్ ప్యాక్‌ని కొనుగోలు చేయవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ 31 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ వీక్లీ డేటా రోల్‌ఓవర్ సపోర్టు అందిస్తుంది. టెలికాం ఆపరేటర్ కూడా 12:00AM నుంచి 6:00AM వరకు లిమిటెడ్ లేకుండా డేటాను ఆఫర్ చేస్తుంది. మరింత డేటా కావాలనుకునే యూజర్లు అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS, రోజుకు 3GBతో వచ్చే రూ.359 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. మీరు కొనుగోలు చేసిన తర్వాత ప్లాన్ 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది.

Read Also :  Netflix Airtel Plans : ఎయిర్‌టెల్ OTT యూజర్లకు అదిరే ఆఫర్.. ఆ రెండు ప్లాన్లపై నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ..!

ట్రెండింగ్ వార్తలు