Airtel Xstream Fiber Plan : 100Mbps స్పీడ్‌తో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌ ఇదిగో.. మరెన్నో OTT బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Airtel Xstream Fiber Plan : భారతి ఎయిర్‌టెల్ (Airtel) ఒకటి. ఎయిర్‌టెల్ అందించే మొబైల్ ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ నుంచి బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల వరకు అన్ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

Airtel Xstream Fiber Plan : 100Mbps స్పీడ్‌తో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌ ఇదిగో.. మరెన్నో OTT బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Airtel Xstream Fiber plan offering 100 mbps speed and added benefits, here are the details

Updated On : February 24, 2023 / 3:42 PM IST

Airtel Xstream Fiber Plan : ప్రముఖ దేశీయ టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్ ప్రొవైడర్లలో భారతి ఎయిర్‌టెల్ (Airtel) ఒకటి. ఎయిర్‌టెల్ అందించే మొబైల్ ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ నుంచి బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల వరకు అన్ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ ఇప్పటికే మొబైల్ కనెక్షన్‌లలో అగ్రగామిగా కొనసాగుతోంది. ఇప్పుడు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ (Xstream Fiber) సర్వీసు ద్వారా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల నెట్‌వర్క్‌ను కూడా విస్తరించింది.

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లతో పాటు ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ స్పీడ్ 40Mbpsతో మొదలై 1 Gbps వరకు చేరుకునే అనేక రకాల ప్లాన్‌లను కస్టమర్లకు అందిస్తోంది. అంతేకాదు.. నెట్‌వర్క్ ఆపరేటర్ అన్‌లిమిటెడ్ కాలింగ్, OTT బెనిఫిట్స్ కూడా ఆఫర్ చేస్తోంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ రీఛార్జ్ కింద అన్ని ప్లాన్‌లు కస్టమర్‌ల అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్నాయి. 100 Mbps ఇంటర్నెట్ స్పీడ్‌ను అందించే ప్లాన్ ద్వారా హోమ్ కనెక్షన్‌ ప్లాన్‌లలో ఒకటిగా ఉంది.

‘స్టాండర్డ్’ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌గా లిస్టుగా 100 Mbps Xstream ఫైబర్ ప్లాన్ ధర రూ. 799గా ఉంది. ఈ ప్లాన్ అదనపు బెనిఫిట్స్‌తో ఇంటర్నెట్, కాలింగ్ సౌకర్యాలను అందిస్తుంది. హై-క్వాలిటీతో OTT కంటెంట్‌ను 4Kలో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఎక్కువ గంటలు గడపడం, లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్‌లను వీక్షించవచ్చు. ఎయిర్‌టెల్ ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్‌ని కోరుకునే యూజర్ల కోసం ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎయిర్‌టెల్ రూ. 799 ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్ కింద అందించే అన్ని ఆఫర్‌లను వివరంగా పరిశీలిద్దాం.

Airtel Xstream Fiber plan offering 100 mbps speed and added benefits, here are the details

Airtel Xstream Fiber plan offering 100 mbps speed and added benefits

Read Also : Airtel Cheapest Plan Price : ఎయిర్‌టెల్ ఈ చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌ ధర అమాంతం పెంచేసింది.. ఇప్పుడు రీఛార్జ్ ప్లాన్ ఎంతో తెలుసా?

ఎయిర్‌టెల్ Xstream ఫైబర్ 100 Mbps ప్లాన్ ఇదే :
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ స్టాండర్డ్ ప్లాన్ ద్వారా 100 Mbps వేగంతో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందిస్తుంది. డౌన్‌లోడ్, అప్‌లోడ్ డేటా వేగంతో రెండింటికీ ఇంటర్నెట్ స్పీడ్ సమానంగా ఉంటుంది. అంతేకాకుండా, కస్టమర్‌లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్‌లను చేసేందుకు అనుమతించే స్టేబుల్ ల్యాండ్‌లైన్‌ను కూడా పొందవచ్చు. అదనంగా, ఈ ప్లాన్‌లో Airtel Thanks బెనిఫిట్‌లు ఉన్నాయి. Airtel Xstream ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, Apollo 24 by 7, FASTag రీఛార్జ్, Wynk Musicను అందిస్తుంది.

Airtel ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ యూజర్లు తమ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో 14+ OTT ఛానెల్‌ల లైవ్ స్పోర్ట్స్ & లైబ్రరీకి యాక్సెస్‌ను అందిస్తుంది. ఇందులో SonyLIV, ErosNow, LionsgatePlay, Ultra, ManoramaMax, HoiChoi, Epic ON, ShemarooMe, Divo, Dollywood, Nammaflix, Klikkకి యాక్సెస్ పొందవచ్చు. షార్ట్‌టీవీ, డాక్యుబే, హంగామాప్లే, సోషల్ స్వాగ్ & చౌపాల్‌తో ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్యాక్ అందిస్తోంది. టెలికాం టాక్ ప్రకారం.. Airtel Xrtream ప్లాన్ గరిష్టంగా ఒకే వ్యవధిలో 60 డివైజ్ కనెక్షన్‌లకు సపోర్టు అందిస్తుంది.

Airtel Xstream ఫైబర్ కనెక్షన్ ఎలా పొందాలంటే? :

– కొత్త Airtel Xstream ఫైబర్ కనెక్షన్‌ని కొనుగోలు చేసేందుకు..
– Airtel బ్రాడ్‌బ్యాండ్ WebPage airtel.in/broadband/ విజిట్ చేయండి.
– మీకు నచ్చిన బెస్ట్ ఇంటర్నెట్ ప్లాన్‌ను ఎంచుకోండి.
– Next ఫారమ్‌ను నింపండి. ఆపై Submit చేయండి.
– మీ మెయిన్ అడ్రస్‌లో కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

Airtel Xstream ప్లాన్‌ని కొనుగోలు చేయాలంటే? :

– Airtel బ్రాడ్‌బ్యాండ్ వెబ్‌పేజీని విజిట్ చేయండి.
– మల్టీ ఆఫర్‌లను ఎంచుకుని ధర, బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయండి.
– మీ అవసరాలకు సరిపోయే ఫైబర్ ప్లాన్‌ను ఎంచుకోండి.
– ప్లాన్ వివరాలను Submit చేయండి. ఆపై Recharge చేసుకోండి.
– మీరు Airtel థాంక్స్ యాప్‌ని ఉపయోగించి మీ ఫైబర్ బ్యాండ్ కనెక్షన్‌ని కూడా చెక్ చేయవచ్చు.

Read Also : Apple iPhone 15 : సరికొత్త నాచ్ డిజైన్‌తో ఆపిల్ ఐఫోన్ 15 వచ్చేస్తోంది.. డైనమిక్ ఐలాండ్ నాచ్ అదుర్స్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!