Amazon Festival Sale 2025
Amazon Festival Sale 2025 : కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? అద్భుతమైన ఫీచర్లతో అతి చౌకైన ధరకే సరికొత్త ల్యాప్‌టాప్ కొనేసుకోవచ్చు. ప్రస్తుం అమెజాన్ సేల్ సందర్భంగా రూ. 20 వేల లోపు ధరలో తక్కువ ధరకే అనేక బ్రాండ్ల ల్యాప్‌టాప్స్ అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఈరోజుతో ముగియనుంది. ఆఫర్ ముగిసేలోగా త్వరపడి (Amazon Festival Sale 2025) సరసమైన ల్యాప్‌టాప్ కొనేసుకోండి. ఈ ధర పరిధిలో హై క్వాలిటీతో ల్యాప్‌టాప్‌లు కొనేసుకోవచ్చు. 512GB స్టోరేజీ, 8GB ర్యామ్ కలిగిన బ్రాండెడ్ ల్యాప్‌టాప్స్ కొనేసుకోవచ్చు. ఈ క్రేజీ డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు..
ఏసర్ స్మార్ట్‌చాయిస్ ఆస్పైర్ 3 :
ఈ ఏసర్ ల్యాప్‌టాప్ ప్రస్తుతం రూ. 20వేల లోపు అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్ ధర 19,990గా ఉంది. మీరు ఎస్బీఐ కార్డ్‌తో లావాదేవీ చేస్తే రూ. 4వేల వరకు ఎక్కువ ఆదా చేయవచ్చు. ఫీచర్ల పరంగా పరిశీలిస్తే.. ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది. ఫుల్ సైజు స్క్రీన్ ఉంటుంది. 256GB SSD స్టోరేజీ, 8GB ర్యామ్ కలిగి ఉంది. విండోస్ 11కి సపోర్టు ఇస్తుంది. సన్నని డిజైన్ కలిగి ఉంటుంది.
జెమిబుక్ ఎక్స్ ప్రో చువి :
ఈ ల్యాప్‌టాప్ (GemiBook X Pro Chuwi) 14.1-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. చువి జెమిబుక్ ధర రూ. 20వేల లోపు లభ్యమవుతుంది. ఈ ల్యాప్‌టాప్ చిన్నగా చాలా తేలికగా ఉంటుంది. 256GB స్టోరేజీ, 8GB LPDDR5 ర్యామ్ కలిగి ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ధర రూ.18,990కు లభిస్తోంది. విండోస్ 11తో రన్ అవుతుంది. మీరు ఎస్బీఐ కార్డ్‌తో ఈ ల్యాప్‌టాప్‌పై రూ. 4వేల వరకు అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
అసూస్ వివోబుక్ గో 15 :
సరసమైన ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? అసూస్ వివోబుక్ గో 15 అతి తక్కువ ధరకే లభిస్తోంది. 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో ఈ ల్యాప్‌టాప్ ధర అమెజాన్‌లో రూ.23,990కు లభిస్తోంది. కానీ, మీరు ఎస్బీఐ కార్డ్ కలిగి ఉంటే రూ.4వేల వరకు సేవ్ చేసుకోవచ్చు. 512GB స్టోరేజీ, 8GB ర్యామ్ కలిగిన ఈ వెర్షన్ ధర రూ. 20వేల కన్నా తగ్గింపు పొందవచ్చు. యాంటీ-గ్లేర్ స్క్రీన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో సహా హై-ఎండ్ ఫీచర్లు కలిగి ఉంది.
లెనోవో V15 (2025) :
మీరు రూ. 20వేల కన్నా తక్కువ ధరకే లెనోవా ల్యాప్‌టాప్ కొనేసుకోవచ్చు. కొత్త లెనోవో V15 అద్భుతమైన ఆప్షన్. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ లెనోవో ల్యాప్‌టాప్ అసలు ధర రూ.23,990 నుంచి భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 4వేల వరకు సేవ్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ యాంటీ-గ్లేర్ టెక్‌తో 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్ కలిగి ఉంది. స్క్రీన్ గ్లేర్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వెర్షన్ 512GB స్టోరేజీ, 8GB ర్యామ్ కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ ఇతర మోడళ్ల మాదిరిగానే ఏడాది వారంటీని అందిస్తుంది.
డ్యూయల్-కోర్ HP ఇంటెల్ సెలెరాన్ :
కొత్త HP ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్ అద్భుతమైన ఆప్షన్. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ కేవలం రూ.21,990కే అందిస్తోంది. ఎస్బీఐ కార్డ్‌తో రూ. 4వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో 512GB SSD స్టోరేజ్, 8GB ర్యామ్, సెలెరాన్ డ్యూయల్ కోర్ N4500 ప్రాసెసర్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌తో ఏడాది వారంటీ కూడా అందిస్తోంది.