Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ లాస్ట్ డే సేల్ ఆఫర్లు.. ఈ 10 స్మార్ట్‌ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!
Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ 10 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లను అసలు మిస్ చేసుకోవద్దు.
Flipkart Big Billion Days Sale
Flipkart Big Billion Days Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈరోజుతో ముగుస్తోంది. గత వారమే ప్రారంభమైన ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ అక్టోబర్ 2 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ ముగిసేలోగా మీకు నచ్చిన ఏ బ్రాండ్ ఫోన్ అయినా తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు.
మీరు ఇప్పటికే కొత్త ఫోన్ కొనకపోతే (Flipkart Big Billion Days Sale) ఇప్పుడే కొనడం బెటర్.. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ద్వారా ఐఫోన్ 16 నుంచి గూగుల్ పిక్సెల్ 9 వరకు మొత్తం 10 స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను పొందవచ్చు. మీరు కూడా ఏదైనా ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..
ఐఫోన్ 16 :
ఆపిల్ ఐఫోన్ 16 అసలు ధర రూ. 69,999 నుంచి ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 53,999కి లభ్యమవుతుంది. బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు.
ఐఫోన్ 16 ప్రో :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్రో ఫస్ట్ టైమ్ లాంచ్ అయినప్పుడు ధర రూ. 109,999 ఉండగా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో మరిన్ని బ్యాంక్ డిస్కౌంట్‌లతో కేవలం రూ. 77,999కి లభ్యమవుతుంది.
Read Also : OnePlus 15 Launch : కొత్త వన్‌ప్లస్ 15 వచ్చేస్తోందోచ్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ అద్భుతమైన కెమెరాతో కర్వడ్ డిస్‌ప్లే, 256GB స్టోరేజీతో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ అసలు ధర రూ. 25,999 ఉండగా తగ్గింపు ధర రూ.18,999కు లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S24 :
శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ పాత ఫ్లాగ్‌షిప్ మోడల్ మాదిరిగా పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ కలిగి ఉంది. ధర మొదట రూ. 74,999గా ఉండేది. కానీ, ప్రస్తుతం ఈ శాంసంగ్ ఫోన్ కేవలం రూ.38,999కే లభిస్తోంది.
ఒప్పో K13x 5G :
బడ్జెట్ మార్కెట్లో ఫస్ట్ రూ.16,999 ధరకు లభించిన ఈ ఒప్పో ఫోన్ ఇప్పుడు కేవలం రూ.9,999 ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ ధరలో బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ S24 FE :
ఈ శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ మొదట రూ. 59,999 ధరకు లభించగా శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ ఫోన్ ప్రస్తుతం రూ. 29,999 తగ్గింపు ధరకే లభిస్తుంది.
మోటోరోలా G96 :
ఈ సేల్ సమయంలో కర్వ్డ్ డిస్‌ప్లేతో ఈ మోటోరోలా G96 ఫోన్ ధర రూ.20,999 నుంచి రూ.14,999కి కొనుగోలు చేయొచ్చు.
వివో T4x 5G :
ఈ వివో ఫోన్ ధర రూ. 17,999 ఉండగా ఇప్పుడు రూ. 12,249కి తగ్గింది. భారత మార్కెట్లో అత్యంత వేగవంతమైన UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్ కలిగి ఉంది.
గూగుల్ పిక్సెల్ 9 :
గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ భారీగా తగ్గింపు పొందింది. ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద తగ్గింపు.. అసలు ధర రూ. 79,999 ఉండగా ఇప్పుడు కేవలం రూ. 52,999కే లభిస్తోంది.
