OnePlus 15 Launch : కొత్త వన్‌ప్లస్ 15 వచ్చేస్తోందోచ్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?
OnePlus 15 Launch : వన్‌ప్లస్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి కొత్త వన్‌ప్లస్ 15 ఫోన్ రాబోతుంది. లీక్ వివరాలు ఇలా ఉన్నాయి.

OnePlus 15 Launch
OnePlus 15 Launch : కొత్త వన్‌ప్లస్ సిరీస్ వచ్చేస్తోంది. వన్‌ప్లస్ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ లైనప్ వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 15R లాంచ్ కానున్నాయి. అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. టెక్ దిగ్గజం అక్టోబర్‌లో చైనాలో వన్‌ప్లస్ 15 లాంచ్ చేయనున్నట్టు ఇప్పటికే రివీల్ చేసంది.
ఆ తర్వాత భారత మార్కెట్లో కూడా (OnePlus 15 Launch) లాంచ్ చేసే అవకాశం ఉంది. అధికారిక లాంచ్‌కు ముందు వన్‌ప్లస్ కంపెనీ వన్‌ప్లస్ 15 డిజైన్, స్పెసిఫికేషన్లు వివరాలను లీక్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ట్రిపుల్ కెమెరాతో రానుంది. వన్‌ప్లస్ 13s మాదిరి డిజైన్ ఉండొచ్చు. హార్డ్‌వేర్ పరంగా పరిశీలిస్తే.. కొత్తగా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ కూడా ఉండనుంది. ఇంకా ఏయే ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం..
వన్‌ప్లస్ 15 స్పెసిఫికేషన్లు (అంచనా) :
వన్‌ప్లస్ 15 క్వాల్కమ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 165Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ 1.5K అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో రానుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో భారీ 7500mAh బ్యాటరీ ఉండొచ్చు.
కెమెరా ఫ్రంట్ సైడ్ లీక్‌లు ప్రైమరీ లెన్స్, అల్ట్రా-వైడ్ సెన్సార్, 3x టెలిఫోటో కెమెరాతో ట్రిపుల్ 50MP సెటప్ సూచిస్తున్నాయి. ఈ ఫోన్ కొత్త సాండ్ స్టార్మ్ ఫినిషింగ్‌ను కూడా అందించనుంది. బ్లాక్, పర్పల్ కలర్ ఆప్షన్లలో చేరే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ 15 భారత్ లాంచ్ టైమ్‌లైన్ :
వన్‌ప్లస్ 15 మోడల్ గత మోడల్ ఫోన్ లాంచ్ టైమ్ కన్నా ముందుగానే లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ వన్‌ప్లస్ ఫోన్ డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 25, 2025 మధ్య వన్‌ప్లస్ 15Rతో పాటుగా లాంచ్ కావచ్చు.
వన్‌ప్లస్ 15 లాంచ్ టైమ్‌లైన్, భారత్ ధర :
రాబోయే వన్‌ప్లస్ 15 ఫోన్ ధర భారీగా ఉంటుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ 15 ధర రూ.65వేలు నుంచి రూ.75వేల మధ్య ఉండవచ్చు. అయితే, భారత మార్కెట్లో వన్‌ప్లస్ 15R ధర దాదాపు రూ.44,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.