Top Waterproof Phones : నీళ్లలో తడిసినా డోంట్ కేర్.. రూ. 20వేల లోపు ధరలో టాప్ 5 వాటర్ ప్రూఫ్ ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి!

Top Waterproof Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? రూ. 20వేల వేల లోపు ధరలో వాటర్ ప్రూఫ్ ఫోన్లు.. మీకు ఏ ఫోన్ కావాలో ఇప్పుడే కొనేసుకోండి..

Top Waterproof Phones : నీళ్లలో తడిసినా డోంట్ కేర్.. రూ. 20వేల లోపు ధరలో టాప్ 5 వాటర్ ప్రూఫ్ ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి!

Top Waterproof Phones

Updated On : October 2, 2025 / 2:41 PM IST

Top Waterproof Phones : అసలే వర్షాకాలం.. అందులోనూ పండగ సీజన్.. ఈ ఫెస్టివల్ సేల్ సమయంలో కస్టమర్లు డిస్కౌంట్ ధరకే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లను కొనేసుకోవచ్చు. ఈ సీజన్‌లో వాటర్ ప్రూఫ్ ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎక్కువమంది వినియోగదారులు వాటర్ ప్రూఫ్ ఫోన్లనే కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

వాటర్ ప్రూఫ్ ఫోన్లు నీళ్లలో తడిసినా చెక్కుచెదరవు. ఈ ఫోన్లలో ప్రత్యేక ఫీచర్ల విషయానికి వస్తే.. IP68, IP69 రేటింగ్‌ కలిగి ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్, హై-ఐపీ రేటింగ్‌లతో బెస్ట్ ఫోన్‌లను కొనేసుకోవచ్చు. రూ.20వేల లోపు బెస్ట్ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ :
ఈ మోటోరోలా ఫోన్ కర్వడ్ డిస్‌ప్లే, ఎఐఎల్-STD-810H అప్రూవల్ అయింది. IP68, IP69 రేటింగ్‌ కలిగి ఉంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ధర రూ.20,999కు పొందవచ్చు. కానీ, బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ధర రూ. 20వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.

Read Also : Top 10 Smart TVs : ఫ్లిప్‌కార్ట్ సేల్ ముగుస్తోంది.. ఈరోజే లాస్ట్.. రూ.10వేల లోపు టాప్ 10 స్మార్ట్‌‌టీవీలు.. ఇప్పుడే కొని ఇంటికి తెచ్చుకోండి!

రియల్‌మి P3 ప్రో :
ఈ రియల్‌మి ఫోన్ వరుసగా IP68, IP66, IP69 సర్టిఫికేట్ కలిగి ఉంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదనపు బ్యాంక్ డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ స్మార్ట్‌టీవీ ధర రూ. 16,999కు కొనుగోలు చేయొచ్చు.

వివో T4R 5G :
ఈ స్టైలిష్ వివో స్మార్ట్‌ఫోన్‌తో IP68, IP69 రేటింగ్స్ పొందాయి. మిలిటరీ-గ్రేడ్ SGS 5-స్టార్ సర్టిఫికేషన్, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 20వేల లోపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

మోటోరోలా G96 5G :
ఈ మోటోరోలా ఫోన్ IP68 రేటింగ్‌తో తగ్గింపు ధర రూ.15,999కు పొందవచ్చు. కస్టమర్లకు అదనపు బ్యాంక్ కార్డ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

పోకో ఎక్స్ 7 ప్రో :
ఈ పోకో ఫోన్‌కు IP66, IP68, IP69 సర్టిఫికేట్స్ అందుబాటులో ఉన్నాయి. నీళ్లు లేదా వర్షం వల్ల ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉండదు. భారీ తగ్గింపు తర్వాత ఈ పోకో ఫోన్ రూ. 20,999కు అందుబాటులో ఉంది. బ్యాంక్ డిస్కౌంట్‌లతో రూ. 20వేల కన్నా తక్కువ ధరకు కొనేసుకోవచ్చు.