Amazon Republic Day Sale (Image Credit To Original Source)
Amazon Great Republic Day Sale 2026 : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లతో సహా వివిధ ప్రొడక్టులపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని చూస్తుంటే ఇది మీకోసమే..
మీరు బడ్జెట్ హ్యాండ్‌సెట్, మిడ్-రేంజ్ ఫోన్ లేదా ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడల్ కోసం చూస్తుంటే అసలు మిస్ చేసుకోవద్దు. అమెజాన్ సేల్ సందర్భంగా కొన్ని స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే డీల్స్ అందిస్తుంది. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఏది కావాలో కొనేసుకోండి.
వన్‌ప్లస్ 15R :
వన్‌ప్లస్ 15R ఫోన్ 165Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. హుడ్ కింద, స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,400mAh బ్యాటరీ అందిస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 15R డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP సోనీ IMX906 మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఫోన్ 32MP కెమెరాతో వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ M56 5జీ ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ M56 5జీ ఫోన్ 6.73-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. హుడ్ కింద, ఈ ఫోన్ ఎక్సినోస్ 1480 చిప్‌సెట్‌తో సపోర్టు ఇస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.
Amazon Republic Day Sale (Image Credit To Original Source)
ఆప్టిక్స్ పరంగా గెలాక్సీ M56 5జీ ఫోన్ 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఫోన్ 12MP కెమెరాతో వస్తుంది. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ M56 5జీ ఫోన్ రూ. 20,999 ధరకు లభిస్తుంది.
ఐక్యూ Z10 ఫోన్ 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. హుడ్ కింద ఈ ఐక్యూ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,300mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.
ఆప్టిక్స్ పరంగా 50MP మెయిన్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరా కూడా ఉంది. అమెజాన్‌లో ఐక్యూ Z10 5జీ రూ. 20,499 ధరకు లభిస్తుంది.
ఇతర స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇవే :
ప్రస్తుతం వివిధ ధరల్లో అనేక స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్‌లతో కొనేసుకోవచ్చు. అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 5 రూ.30,999 ధరకు లభిస్తోంది. అయితే, ఐక్యూ నియో 10 5జీ ఫోన్ ధర రూ.33,999కు లభిస్తోంది.
మిడ్ రేంజ్ కేటగిరీలో రూ.19,999 ధరకు రెడ్‌మి నోట్ 15 5జీ, రూ.15,999 ధరకు రియల్‌మి నార్జో 80 ప్రో 5జీ, శాంసంగ్ గెలాక్సీ M36 5జీ ఉన్నాయి. ఈ రెండూ ఫోన్లూ రూ.15,999 ధరకు లభ్యమవుతున్నాయి.
బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్లలో శాంసంగ్ గెలాక్సీ M17 5G ఫోన్ రూ.12,999, రియల్‌మి నార్జో 90x 5జీ ధర రూ.12,749, ఐక్యూ Z10 లైట్ 5జీ ధర రూ.10,999, లావా స్ట్రోమ్ ప్లే 5జీ రూ.11,249 ధరకు అందుబాటులో ఉన్నాయి. లావా స్టార్మ్ లైట్ 5జీ ధర రూ.8,749 కాగా, రియల్‌మి నార్జో 90 5జీ ధర రూ.15,999కు లభిస్తోంది.