MG Windsor EV : కొత్త ఈవీ కారు భలే ఉంది.. జస్ట్ రూ. 2 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఇంటికి తెచ్చుకోవచ్చు.. నెలకు EMI ఎంతంటే?
MG Windsor EV : ఎంజీ విండ్సర్ ఈవీ కారు కావాలా? కేవలం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి కొనేసుకోవచ్చు.. మొత్తం ధర, ఈఎంఐ ఎంతంటే?
MG Windsor EV (Image Credit To Original Source)
- ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు కేవలం రూ. 2 లక్షలే డౌన్ పేమెంట్
- ఎంజీ విండ్సర్ ఈవీ ధర రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- టాప్-ఎండ్ వేరియంట్ రూ. 19.56 లక్షలు (ఎక్స్-షోరూమ్)
MG Windsor EV : కొత్త ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో జేఎస్‌డబ్యూ ఎంజీ మోటార్ కారు అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఎంజీ విండ్సర్ ఈవీ కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈవీ కారును కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే.. మీరు కేవలం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు.. నెలవారీ ఈఎంఐతో సరసమైన ధరకే ఇంటికి కొని తెచ్చుకోవచ్చు.
భారత్‌లో ఎంజీ విండ్సర్ ఈవీ ధర ఎంతంటే? :
ఎంజీ విండ్సర్ ఈవీ ధర రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ఉంటే.. టాప్-ఎండ్ వేరియంట్ రూ. 19.56 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఢిల్లీలో బేస్ వేరియంట్ కేవలం ఇన్సూరెన్స్ కోసం దాదాపు రూ. 10వేలు, ఆర్టీఓ ఛార్జీల కోసం సుమారు రూ.73వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్-రోడ్ ధర రూ. 14.99 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.

MG Windsor EV (Image Credit To Original Source)
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో ఈఎంఐ ఆప్షన్ :
రూ. 2 లక్షల డౌన్‌పేమెంట్ చెల్లించాక మిగిలిన లోన్ మొత్తం రూ. 12.99 లక్షలు అవుతుంది. ఈ మొత్తాన్ని 9 శాతం వడ్డీ రేటుతో 7 ఏళ్ల పాటు లోన్ తీసుకుంటే.. నెలవారీ ఈఎంఐ దాదాపు రూ. 20,900 వరకు ఉంటుంది.
లోన్ వ్యవధిలో మొత్తం ఖర్చు :
7 ఏళ్ల పూర్తి కాలంలో మీరు బ్యాంకుకు దాదాపు రూ.17.55 లక్షలు చెల్లిస్తారు. అంటే.. చెల్లించిన మొత్తం వడ్డీ దాదాపు రూ. 4.56 లక్షలు. ఈఎంఐ నెలవారీగా చెల్లించాలి. రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించాలి. దాదాపు రూ. 20,900 ఈఎంఐతో ఎంజీ విండ్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కారును ఇంటికి తెచ్చుకోవచ్చు.
