Amazon Sale Offers : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్లపై గరిష్టంగా 50శాతం డిస్కౌంట్.. డోంట్ మిస్..!

Amazon Great Republic Day Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ 5జీ ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. గరిష్టంగా 50 శాతం తగ్గింపుతో శాంసంగ్ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు.

Amazon Great Republic Day Sale

Amazon Great Republic Day Sale 2024 : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా కొన్ని శాంసంగ్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ఈ శాంసంగ్ ఫోన్‌లపై అత్యుత్తమ డీల్‌లు, డిస్కౌంట్‌లను పొందవచ్చు. అంటే.. 50శాతం వరకు తగ్గింపుతో కొన్ని లేటెస్ట్ శాంసంగ్ ఫోన్‌లను పొందే అవకాశాన్ని అందిస్తోంది.

ఈ సేల్ శాంసంగ్ ఔత్సాహికులకు తమ స్మార్ట్‌ఫోన్‌లను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి సువర్ణావకాశం. మీరు అధునాతన కెమెరాలు, లాంగ్ లైఫ్ ఉండే బ్యాటరీలు లేదా పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ల వంటి అత్యాధునిక ఫీచర్‌లతో కూడిన బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ సేల్‌లో కొన్ని శాంసంగ్ 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన శాంసంగ్ ఫోన్ కొనేసుకోండి.

Read Also : Vivo G2 Launch : అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వివో G2 ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?

1. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ :
ఈ శాంసంగ్ 5జీ ఫోన్ అనేది టెక్ ఔత్సాహికులకు అద్భుతమైన ఆప్షన్. డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లే హెచ్‌డీఆర్10+ సపోర్ట్ అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. అయితే, బలమైన గొరిల్లా గ్లాస్ 5 మన్నికను అందిస్తుంది. అమెరికాలో ఎక్సినోస్ 2200 చిప్‌సెట్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ద్వారా ఆధారితమైన ఈ ఫోన్ 8జీబీ ర్యామ్‌తో మృదువైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. 50ఎంపీ ప్రధాన సెన్సార్‌తో సహా ట్రిపుల్ కెమెరా సెటప్, హై-క్వాలిటీ ఫొటోలు, వీడియోలను రికార్డు చేయొచ్చు. మీరు ఈ ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్‌లను పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ స్పెసిఫికేషన్‌లు :
డిస్‌ప్లే : 6.4 అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్, హెచ్‌డీఆర్10+, 1450నిట్స్
రిజల్యూషన్ : 1080 x 2340 పిక్సెల్స్
ఓఎస్ : ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14కి అప్‌గ్రేడబుల్, వన్ యూఐ 6
చిప్‌సెట్ : ఎక్సినోస్ 2200/స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1
ఇంటర్నల్ మెమరీ : 128జీబీ/256జీబీ, 8జీబీ ర్యామ్
కెమెరా : 50ఎంపీ వైడ్, 8ఎంపీ టెలిఫోటో (3ఎక్స్ జూమ్), 12ఎంపీ అల్ట్రావైడ్
సెల్ఫీ కెమెరా : 10ఎంపీ
సౌండ్ : స్టీరియో స్పీకర్లు, 3.5ఎమ్ఎమ్ జాక్ లేదు

2. శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ :
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ అనేది సున్నితమైన విజువల్స్ 120హెచ్‌జెడ్ ఎస్అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50ఎంపీ ట్రిపుల్ నో షేక్ కెమెరా, హై-క్వాలిటీ ఫొటోలను తీయొచ్చు. భారీ 6000ఎంఎహెచ్ బ్యాటరీ సపోర్టు ఇస్తుంది. అయితే, 5జీ సామర్థ్యం వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. 6జీబీ ర్యామ్, 12జీబీ విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 13తో పనితీరు, లాంగ్ లైఫ్ రెండింటికీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Amazon Great Republic Day Sale

శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్పెసిఫికేషన్‌లు :
డిస్‌ప్లే : 120హెచ్‌జెడ్ ఎస్అమోల్డ్
ర్యామ్/స్టోరేజ్ : 6జీబీ/128జీబీ, 12జీబీ వరకు విస్తరించవచ్చు
కెమెరా : 50ఎంపీ ట్రిపుల్ నో షేక్ కెమెరా
బ్యాటరీ : 6000ఎంఎహెచ్
ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
ఇతర ఫీచర్లు : 4 జెన్ ఓఎస్ అప్‌గ్రేడ్, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్

3. శాంసంగ్ గెలాక్సీ ఎ04 :
శాంసంగ్ గెలాక్సీ ఎ04 ఫోన్ సమర్థవంతమైన పనితీరుతో బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్. మీడియాటెక్ హెలియో పీ35 ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ కలిగి ఉంది. 8జీబీ వరకు విస్తరించవచ్చు. 5000ఎంఎహెచ్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. 13ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ అందిస్తుంది. లేత ఆకుపచ్చ డిజైన్ టచ్ అందిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎ04 స్పెసిఫికేషన్‌లు :
ప్రాసెసర్ : మీడియాటెక్ హెలియో పీ35 అక్టా-కోర్
ఏఎమ్/స్టోరేజ్ : 4జీబీ/64జీబీ, 8జీబీ వరకు విస్తరించవచ్చు
కెమెరా : 13ఎంపీ డ్యూయల్ కెమెరా
బ్యాటరీ : 5000ఎంఎహెచ్

4. శాంసంగ్ గెలాక్సీ ఎ23 5జీ :
శాంసంగ్ గెలాక్సీ ఎ23 5జీ అనేది స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో కూడిన 5జీ-రెడీ డివైజ్.. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంది. స్టోరేజీ, మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఫ్లూయిడ్ విజువల్స్‌ను అందిస్తుంది. అయితే, 5000ఎంఎహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 50ఎంపీ క్వాడ్ కెమెరా వివరణాత్మక ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎ23 5జీ స్పెసిఫికేషన్‌లు :
ప్రాసెసర్ : క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఆక్టా-కోర్
డిస్‌ప్లే : 6.6-అంగుళాల ఎల్‌సీడీ, 120హెచ్‌జెడ్, 1080 x 2408 రిజల్యూషన్
ర్యామ్/స్టోరేజ్ : 8జీబీ/128జీబీ, 1టీబీ వరకు విస్తరించవచ్చు
కెమెరా : 50ఎంపీ ఓఐఎస్ క్వాడ్ కెమెరా
బ్యాటరీ : 5000ఎంఎహెచ్
ఓఎస్ : ఆండ్రాయిడ్ 12.0

5. శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ :
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ మోడల్ 6000ఎంఎహెచ్ బ్యాటరీ, 5జీ సపోర్టుతో వస్తుంది. 50ఎంపీ ట్రిపుల్ కెమెరా అద్భుతమైన ఫొటోలను తీయొచ్చు. 5ఎన్ఎమ్ ప్రాసెసర్ అందిస్తుంది. 4జీబీ ర్యామ్, 12జీబీ వరకు విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 13తో సరసమైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ స్పెసిఫికేషన్‌లు :
ప్రాసెసర్ : 5ఎన్ఎమ్ ప్రాసెసర్
ర్యామ్/స్టోరేజ్ : 4జీబీ/128జీబీ, 12జీబీ అప్‌గ్రేడ్
కెమెరా : 50ఎంపీ ట్రిపుల్ కెమెరా
బ్యాటరీ : 6000ఎంఎహెచ్
ఓఎస్ : ఆండ్రాయిడ్ 13

Read Also : Apple Vision Pro Discount : మీకు ఆపిల్ ఉద్యోగి తెలిస్తే.. విజన్ ప్రోని 25శాతం తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు..!