Vivo G2 Launch : అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వివో G2 ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?

Vivo G2 Launch : ఈ హ్యాండ్‌సెట్ 7ఎన్ఎమ్ డైమెన్సిటీ 6020 చిప్‌తో 8జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌తో వస్తుంది. ఈ ఫొటోగ్రఫీ, వీడియోలను క్యాప్చర్ చేయొచ్చు. వివో జీ2 మోడల్ 13ఎంపీ వెనుక కెమెరాతో, ఎఫ్/2.2 ఎపర్చర్‌తో వస్తుంది.

Vivo G2 Launch : అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వివో G2 ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?

Vivo G2 With 13MP Rear Camera, Dimensity 6020 Chip Launched

Updated On : January 20, 2024 / 8:43 PM IST

Vivo G2 Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వివో నుంచి సరికొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోలో వివో జీ2 కొత్త ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌తో పాటుగా 256జీబీ వరకు ఇంబిల్ట్ స్టోరేజ్‌తో వస్తుంది. వివో హ్యాండ్‌సెట్‌లో 15డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్ అందించే 5,000ఎంఎహెచ్ బ్యాటరీ కూడా ఉంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ప్రకారం.. ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఆర్జిన్OS మోడల్ 3 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది.

వివో జీ2 ధర, లభ్యత :
వివో జీ2 ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో కూడిన బేస్ మోడల్ ధర సీఎన్‌వై 1,199 (దాదాపు రూ. 14వేలు)గా నిర్ణయించింది. మీరు స్మార్ట్‌ఫోన్‌ను వరుసగా సీఎన్‌వై 1,499 (దాదాపు రూ. 17,500), సీఎన్‌వై 1,599 (దాదాపు రూ. 18,700) ధరతో 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Read Also : Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

అత్యంత ఖరీదైన కాన్ఫిగరేషన్ ధర సీఎన్‌వై 1,899 (దాదాపు రూ. 22వేలు) ఉంటుంది. ఈ వెర్షన్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో అమర్చి ఉంది. కస్టమర్‌లు చైనాలో వివో జీ2 మోడల్ ఒకే స్పేస్ బ్లాక్ కలర్‌వేలో కొనుగోలు చేయవచ్చు. భారత్ సహా ఇతర మార్కెట్‌లలో ఫోన్‌ను లాంచ్ చేయాలనే ప్రణాళికలపై వివో నుంచి ఎలాంటి సమాచారం లేదు.

వివో జీ2 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
కొత్తగా లాంచ్ అయిన వివో జీ2 మోడల్ డ్యూయల్ సిమ్ (నానో) స్మార్ట్‌ఫోన్, ఆండ్రాయిడ్ 13పై ఆధారపడిన ఆర్జిన్ఓఎస్ 3పై రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల హెచ్‌డీ+ (720×1,612 పిక్సెల్‌లు) ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 89.67 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగి ఉంది.

Vivo G2 With 13MP Rear Camera, Dimensity 6020 Chip Launched

Vivo G2 Launched

ఈ హ్యాండ్‌సెట్ 7ఎన్ఎమ్ డైమెన్సిటీ 6020 చిప్‌తో 8జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌తో వస్తుంది. ఈ ఫొటోగ్రఫీ, వీడియోలను క్యాప్చర్ చేయొచ్చు. వివో జీ2 మోడల్ 13ఎంపీ వెనుక కెమెరాతో, ఎఫ్/2.2 ఎపర్చర్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎఫ్/2.8 ఎపర్చరుతో వీడియో కాల్‌లు, సెల్ఫీలను తీసుకోవచ్చు.

వివో జీ2లో 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని పొందవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-C పోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ ఉన్నాయి. బోర్డ్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, ఫ్లికర్ సెన్సార్ ఉన్నాయి.

వివో హ్యాండ్‌సెట్ 15డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. కంపెనీ ప్రకారం.. వివో జీ2 మోడల్ 165.74×75.43×8.09ఎమ్ఎమ్ కొలతలు, 186గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : Honda NX500 Bike Launch : కొత్త బైక్ కొంటున్నారా? దిమ్మతిరిగే ఫీచర్లతో హోండా NX500 అడ్వెంచర్ బైక్.. బుకింగ్స్ ఓపెన్.. ధర ఎంతంటే?