Apple Warns Users : ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు పక్కన పడుకోవద్దని వినియోగదారుల్ని హెచ్చరిస్తున్న యాపిల్..ఎందుకంటే?
చాలామందికి రాత్రివేళ ఫోన్ మాట్లాడి బెడ్ పక్కనే పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఒక్కోసారి బెడ్ మీదనే ఛార్జింగ్‌లో పెట్టి నిద్రపోతారు. ఇలాంటి అలవాటు ఉన్న వినియోగదారుల కోసం యాపిల్ కంపెనీ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. అదేంటంటే?

Apple Warns Users
Apple Warns Users : ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టి మాట్లాడొద్దని.. రాత్రివేళ ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోవద్దని జాగ్రత్తలు చెబుతారు. వాటి రేడియేషన్ రకరకాల అనారోగ్యాలకు కారణమౌతోంది. ఒక్కోసారి అవి పేలితే అనేక అనర్ధాలు కూడా జరగొచ్చు. అయితే యాపిల్ కంపెనీ ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు పక్కన పెట్టుకుని నిద్రపోవద్దని కస్టమర్లకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
Apple Company Shoes : యాపిల్ కంపెనీ షూస్ .. ధర వింటే షాకే
వినియోగదారులు తమ ఫోన్లు ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు పక్కన పెట్టుకుని నిద్రపోవద్దని యాపిల్ హెచ్చరిస్తోంది. ఫోన్‌కి దగ్గరలో నిద్రపోవడం వల్ల జరిగే అనర్ధాలను ఇప్పటికే పలు అధ్యయనాలు హైలైట్ చేసాయి. అయితే తాజాగా ఐఫోన్ తయారీదారు యాపిల్ స్మార్ట్ ఫోన్‌లను పట్టుకుని నిద్రపోయే అలవాటు ఉన్న వ్యక్తుల కోసం, ముఖ్యంగా ఫోన్ ఛార్జర్‌కి కనెక్ట్ చేసినపుడు పక్కన పడుకునే వారి కోసం హెచ్చరిక జారీ చేసింది. యాపిల్ ఆన్ లైన్ యూజర్ గైడ్‌లో కూడా ఈ హెచ్చరికలు చేర్చారు.
యాపిల్ చేస్తున్న హెచ్చరిక ఏంటంటే ఐఫోన్లు బాగా వెంటిలేషన్ ఉన్న వాతావరణంలో టేబుల్ లేదా ప్లాట్‌గా ఉండే ప్రాంతంలో ప్రత్యేకంగా ఛార్జ్ చేయాలని సలహా ఇస్తోంది. దుప్పట్లు, దిండ్లు లేదా మనకు దగ్గరగా ఉన్న పరిసరాల్లో ఛార్జింగ్ చేయవద్దని స్పష్టం చేస్తోంది.
ఐఫోన్ 14 ప్లస్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్
ఐఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు వేడిని ఉత్పత్తి చేస్తాయి. పరిమితమైన పరిసరాల కారణంగా ఈ వేడిని విడుదల చేయలేనప్పుడు అది మండే ప్రమాదం ఉంది. ఫలితంగా మీ దిండు లాంటి ప్రాంతాల్లో ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టడం సురక్షితం కాదు. ఫోన్ లేదా పవర్ అడాప్టర్, వైర్‌లెస్ ఛార్జర్‌పై నిద్రపోవద్దని, వాటిని పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేసినపుడు వాటిని దుప్పటి, దిండు లేదా మీ శరీరం కింద ఉంచవద్దని యాపిల్ స్పష్టం చేస్తోంది. ఐఫోన్, పవర్ అడాప్టర్, వైర్ లెస్ ఛార్జర్ ఉపయోగించినపుడు లేదా ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచమని సూచిస్తోంది.
యాపిల్ దెబ్బతిన్న కేబుల్స్ లేదా ఛార్జర్లను ఉపయోగించడం లేదా తడిగా ఉన్న ప్రదేశంలో ఛార్జింగ్ చేయకూడదని కూడా యాపిల్ సలహా ఇస్తోంది. ఐఫోన్ వినియోగదారులు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి.