×
Ad

Apple iPad Pro : M5 చిప్‌తో ఆపిల్ ఐప్యాడ్ ప్రో ఆగయా.. ఏఐ ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్

Apple iPad Pro : ఆపిల్ కొత్త ఐప్యాడ్ ప్రో వచ్చేసింది. M5 ప్రాసెసర్, ఏఐ ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

Apple iPad Pro

Apple iPad Pro : ఆపిల్ ఐప్యాడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. M5 ప్రాసెసర్‌తో ఐప్యాడ్ ప్రోను ఆపిల్ లాంచ్ చేసింది. లేటెస్ట్ చిప్ ఏఐ పర్ఫార్మెన్స్, స్టోరేజీ పర్ఫార్మెన్స్, టాబ్లెట్‌ అద్భుతమైన గ్రాఫిక్స్‌ను అందిస్తోంది. ఈ ఐప్యాడ్ వై-ఫై, వై-ఫై + సెల్యులార్ అనే రెండు వేరియంట్లు కలిగి ఉంది. లేటెస్ట్ ఐప్యాడ్ ప్రో ధర, లభ్యత, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలపై ఓసారి పరిశీలిద్దాం.

భారత్‌లో ఆపిల్ ఐప్యాడ్ ప్రో ధర, లభ్యత :
ఆపిల్ ఐప్యాడ్ ప్రో 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వై-ఫై వేరియంట్ M5 చిప్‌తో భారత మార్కెట్లో రూ. 99,900 ప్రారంభ ధరకు లభిస్తోంది. అంతేకాకుండా, వై-ఫై + సెల్యులార్ వేరియంట్ భారత మార్కెట్లో రూ. 1,19,900 ప్రారంభ ధరకు కొనుగోలు చేయొచ్చు.

ఈ ఐప్యాడ్ ప్రో 11-అంగుళాలు, 13-అంగుళాలతో సహా రెండు స్క్రీన్ సైజులు కలిగి ఉంది. అంతేకాదు.. సిల్వర్, స్పేస్ బ్లాక్ అనే రెండు వేర్వేరు కలర్ ఆప్షన్లలో కూడా పొందవచ్చు. ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే దేశంలో ప్రారంభమయ్యాయి. ఈ సేల్ అక్టోబర్ 22, 2025 నుంచి ప్రారంభమవుతుంది.

Read Also : OnePlus Diwali Sale : వన్‌ప్లస్ దీపావళి సేల్ ఆఫర్లు.. ఈ వన్‌ప్లస్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. ఇలాంటి డీల్స్ అసలు మిస్ చేయొద్దు..!

ఆపిల్ ఐప్యాడ్ ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐప్యాడ్ ప్రో 11-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇందులో M4 చిప్‌సెట్ కన్నా 3.5 రెట్లు వేగంగా ఏఐ టాస్కులతో రన్ అయ్యే ఎం5 ప్రాసెసర్ ఉంది. ఈ డివైజ్ న్యూరల్ యాక్సిలరేటర్‌తో 10-కోర్ జీపీయూ కూడా కనిపిస్తుంది. రీడ్ అండ్ రైట్ స్పీడ్ గతంలో కన్నా పోలిస్తే 2 రెట్లు వేగంగా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

ఎం5 చిప్‌తో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఓఎస్ 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. లిక్విడ్-గ్లాస్ థీమ్‌తో పాటు మల్టీ కొత్త ఫీచర్లను అందిస్తుంది. ఆసక్తిగల వినియోగదారులు తమ ప్యాడ్‌లో మెనూ బార్‌తో పాటు కొత్త విండోయింగ్ సిస్టమ్‌, టాబ్లెట్‌ అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను అందిస్తోంది.