Apple iPhone 11 Sale : అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 11.. కేవలం రూ. 8,950కే సొంతం చేసుకోవచ్చు.. డోంట్ మిస్!

Apple iPhone 11 Sale : ఆపిల్ ఐఫోన్ 11 ఇప్పటికీ అనేక ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ డివైజ్‌కు ఆపిల్ నుంచి సపోర్టు నిలిపివేయడంతో మార్కెట్లో కనిపించకుండా పోయింది.

Apple iPhone 11 available at Rs 8,950 in a Flipkart sale after Rs 32,049 discount

Apple iPhone 11 Sale on Flipkart : 2020లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఆపిల్ ఐఫోన్ 11 మోడల్.. ఇప్పటివరకు అత్యంత ప్రజాదరణ పొందిన ఐఫోన్ మోడల్‌లలో ఇదొకటి. ఆపిల్ iPhone 14 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత (Apple iPhone 11)ని కంపెనీ నిలిపివేసింది. కానీ, ఇప్పటికీ బెస్ట్ కెమెరా ఫీచర్లు, మంచి పనితీరుతో విలువైన స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు.

ఐఫోన్ 11 సిరీస్‌లో బేస్ మోడల్ ఉండగా.. ఇందులో ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్ కూడా ఉన్నాయి. 2019లో భారత మార్కెట్లో రూ. 64,900 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇప్పుడు అదే ఐఫోన్ 11 ధర రూ. 32,049 డిస్కౌంట్ తర్వాత ఫ్లిప్‌కార్ట్ సేల్‌ (Flipkart Sale)లో కేవలం రూ. 8,950కే లభిస్తుంది.

Read Also : Samsung Galaxy S22 Price : శాంసంగ్ గెలాక్సీ S22 ధర తగ్గిందోచ్.. మరెన్నో డిస్కౌంట్లు.. కొత్త ధర ఎంతో తెలుసా?

ఆపిల్ ఐఫోన్ 11 మోడల్ 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD డిస్‌ప్లేను కలిగి ఉంది. A13 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ 12MP సెన్సార్లు, ముందు భాగంలో 12MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 11 ధర రూ.2,901 తగ్గింపు తర్వాత రూ.40,999 వద్ద ఉంది. అంతేకాదు.. కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Apple iPhone 11 Sale available at Rs 8,950 in a Flipkart sale after Rs 32,049 discount

దాంతో ఈ డివైజ్ ధర రూ. 38,950కి తగ్గుతుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 30వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. రూ.32,049 డిస్కౌంట్ తర్వాత ఫ్లిప్‌కార్ట్ నుంచి మీరు కేవలం రూ.8,950కే ఆపిల్ ఐఫోన్11ని సొంతం చేసుకోవచ్చు. (iPhone 11) ఇప్పటికీ అనేక ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ డివైజ్ నిలిచినప్పటికీ ఆపిల్ నుంచి సపోర్టును అందిస్తుంది.

Read Also : Apple iPhone 12 Mini Sale : ఆపిల్ ఐఫోన్ 12 మినీపై భారీ డిస్కౌంట్.. కేవలం రూ. 16,999కే సొంతం చేసుకోండి.. డోంట్ మిస్..!

ట్రెండింగ్ వార్తలు