Samsung Galaxy S22 Price : శాంసంగ్ గెలాక్సీ S22 ధర తగ్గిందోచ్.. మరెన్నో డిస్కౌంట్లు.. కొత్త ధర ఎంతో తెలుసా?

Samsung Galaxy S22 Price Cut : శాంసంగ్ గెలాక్సీ S22 ధర భారీగా తగ్గింది. అదనపు డిస్కౌంట్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

Samsung Galaxy S22 Price : శాంసంగ్ గెలాక్సీ S22 ధర తగ్గిందోచ్.. మరెన్నో డిస్కౌంట్లు.. కొత్త ధర ఎంతో తెలుసా?

Samsung Galaxy S22 Price in India Slashed

Samsung Galaxy S22 Price Cut : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ S22 ఫోన్ భారత మార్కెట్లో భారీ డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 2022లో లాంచ్ అయింది. ఇప్పుడు దీని ధర రూ. 72,999గా ఉంది. 4nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC ద్వారా పవర్ అందిస్తుంది. 25W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 3,700mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ ఫోన్ 2స్టోరేజ్ వేరియంట్‌లలో 5 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో కూడా వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S22 ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ S22 బేస్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధరపై రూ. 8వేలు భారీగా తగ్గించింది. దాంతో ఈ ఫోన్ అసలు ధర రూ. 72,999 నుంచి రూ. 64,999కి తగ్గింది. శాంసంగ్ ఇండియా (Samsung India)లో పాత స్మార్ట్‌ఫోన్‌ల నుంచి కొత్త మోడల్‌కి అప్‌గ్రేడ్ అవుతున్న కస్టమర్‌లకు అప్‌గ్రేడ్ బోనస్ రూ. 7వేలు అందిస్తోంది. దీంతో ఈ మోడల్ ధర రూ. 57,999కు తగ్గింది.

Read Also : Ola S1 Air Scooter : అత్యంత చౌకైన ఓలా S1 ఎయిర్ స్కూటర్ వచ్చేస్తోంది.. జూలై 1 నుంచే డెలివరీలు.. సింగిల్ 3kwh వేరియంట్ మాత్రమే..!

భారతీయ కొనుగోలుదారులు ఇప్పుడు బేస్ Samsung S22 మోడల్‌ను రూ. 54,999 కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో రూ. 3వేలు వరకు పొందవచ్చు. ఈ ఫోన్ (Samsung India) వెబ్‌సైట్, (Amazon) ప్లాట్ ఫారాల్లో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. బోరా పర్పుల్, గ్రీన్, ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ వైట్, పింక్ గోల్డ్ అనే 5 కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Samsung Galaxy S22 Price in India Slashed

Samsung Galaxy S22 Price Cut in India Slashed

శాంసంగ్ గెలాక్సీ S22 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే :
6.1-అంగుళాల ఫుల్-HD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేతో, శాంసంగ్ గెలాక్సీ S22 120Hz వరకు రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ Victus+ ప్రొటెక్షన్‌తో వస్తుంది. డ్యూయల్ నానో సిమ్-సపోర్ట్ కలిగిన స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12-ఆధారిత One UI 4.1 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతుంది.

ఈ హ్యాండ్‌సెట్ 4nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC ద్వారా 8GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S22 ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ షూటర్‌తో కూడిన 12MP సెన్సార్ టెలిఫోటో లెన్స్‌తో 10MP సెన్సార్ ఉన్నాయి. డిస్‌ప్లే పైభాగంలో పంచ్-హోల్ స్లాట్ 10MP సెల్ఫీ కెమెరా సెన్సార్‌తో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S22 ఫోన్ 25W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3,700mAh బ్యాటరీని అందిస్తుంది. 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, USB టైప్-C కనెక్టివిటీని అందిస్తుంది. డెస్ట్, నీటి నిరోధకత IP68 రేటింగ్‌తో వస్తుంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. 168 గ్రాముల బరువు, శాంసంగ్ గెలాక్సీ S22 సైజు (146mm x 70.6mm x 7.6mm) కలిగి ఉంది.

Read Also : Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.. డోంట్ మిస్..!