Ola S1 Air Scooter : అత్యంత చౌకైన ఓలా S1 ఎయిర్ స్కూటర్ వచ్చేస్తోంది.. జూలైలో డెలివరీలు.. సింగిల్ 3kwh వేరియంట్ మాత్రమే..!

Ola S1 Air Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది. సింగిల్ 3kWh వేరియంట్‌లో మాత్రమే రానుంది. వచ్చే జూలై నుంచే డెలివరీలు మొదలు కానున్నాయి. కానీ, కచ్చితమైన తేదీని ఓలా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Ola S1 Air Scooter : అత్యంత చౌకైన ఓలా S1 ఎయిర్ స్కూటర్ వచ్చేస్తోంది.. జూలైలో డెలివరీలు.. సింగిల్ 3kwh వేరియంట్ మాత్రమే..!

Ola S1 Air Scooter now only gets a single 3kWh variant

Ola S1 Air Scooter now only gets a single 3kWh variant : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వెహికల్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రానిక్ (Ola Electric) ఈవీ మార్కెట్లో వేగంగా దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్ పెరగడంతో ఓలా మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. దేశంలో ఈవీ వెహికల్ కంపెనీల్లో నెంబర్‌వన్‌ బ్రాండ్‌గా ఓలా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ (bhavish aggarwal) ఈ ఓలా S1 ఎయిర్ స్కూటర్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఓలా ఎలక్ట్రిక్ అత్యంత సరసమైన మోడల్‌ ‘S1 ఎయిర్‌’ స్కూటర్‌ లాంచ్ చేయనున్నట్టు ఓలా సీఈఓ అగర్వాల్ ప్రకటించారు. ఓలా S1 ఎయిర్‌(Ola S1 Air) స్కూటర్ డెలివరీలు జూలై నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. కానీ, కచ్చితమైన తేదీని అధికారికంగా ఓలా ప్రకటించలేదు. దీనికి సంబంధించి టీజర్‌ను అగర్వాల్ ట్విట్టర్ వేదికగా వీడియోను పోస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా, ఓలా S1 ఎయిర్ స్కూటర్ ప్రీ-బుకింగ్స్‌ కూడా ప్రారంభమయ్యాయి.

Read Also : MG ZS EV Resale Value : రీసేల్ వాల్యూలో ఆ ఈవీల కన్నా ఎంజీ ZS EV SUV కార్లదే ఆధిపత్యం.. ఏ SUV కార్ల రీసేల్ వాల్యూ ఎంతంటే?

సింగిల్ వేరియంట్ 3kWh మాత్రమే :
వాస్తవానికి.. ఓలా S1 ఎయిర్ డెలివరీలు 2023 మొదటి త్రైమాసికంలోనే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, 2023 రెండవ త్రైమాసికానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఇ-స్కూటర్ ఇంకా విక్రయించలేదు. ఓలా S1 ఎయిర్ ఇప్పుడు సింగిల్ 3kWh వేరియంట్‌లో మాత్రమే వస్తుంది. దీని ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, FAME-II సబ్సిడీతో సహా).

S1 ఎయిర్ స్కూటర్ 3kWh బ్యాటరీ ప్యాక్ 4.5kW మోటార్‌తో రానుంది. ఫుల్ ఛార్జ్‌పై 125 కి.మీ దూసుకెళ్తుంది. అంటే.. గరిష్ఠంగా గంటకు 85km వేగాన్ని అందిస్తుంది. 3kWh వేరియంట్‌కు గరిష్ట డిమాండ్ ఉండటంతో ఈ రెండు వేరియంట్‌లు నిలిపివేసినట్టు కంపెనీ అధికారి ప్రకటనలో తెలియజేశారు.

ఓలా S1 ఎయిర్‌ డెలివరీలతో పాటు టెస్ట్‌ రైడ్లు వచ్చే నెలలోనే మొదలు కానున్నాయి. ఓలా S1 స్కూటర్‌ కన్నా S1 ఎయిర్‌ స్కూటర్ అత్యంత చౌకైన ధరకే రానుంది. ఈ S1 ఎయిర్ స్కూటర్‌ మొత్తం 3 వేరియంట్లలో 3 బ్యాటరీ ప్యాక్‌ (2kwh, 3kwh, 4kwh) ఆప్షన్లతో అందుబాటులోకి తీసుకురావాలని భావించింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ ఆధారంగా కేవలం ఓలా s1 ఎయిర్ సింగిల్ వేరియంట్ (3kwh) మాత్రమే మార్కెట్లోకి తీసుకురానుందని కంపెనీ వెల్లడించింది.

ఇతర వేరియంట్లు బుకింగ్ చేసుకుంటే ఎలా? :
ప్రస్తుతం, Ola S1 ఎయిర్ ఇతర వేరియంట్‌లను బుక్ చేసిన కస్టమర్‌లందరికీ ఈ 3kWh వేరియంట్‌ తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఓలా వారి స్కూటర్‌లను 3kWh ట్రిమ్‌కి ప్రారంభ ధరకు మారుస్తుంది. కొనుగోలు విండో సమయంలో మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి ఓలా వీలు కల్పిస్తుంది. అయితే, కొనుగోలుదారులు కావాలనుకుంటే.. తమ బుకింగ్‌లను కూడా రద్దు చేసుకోవచ్చు. ఓలా ఆ మొత్తాన్ని బుకింగ్ చేసుకున్నవారికి తిరిగి చెల్లిస్తుంది.

Ola S1 Air now only gets a single 3kWh variant, Check Full Details

Ola S1 Air Scooter : Ola S1 Air now only gets a single 3kWh variant, Check Full Details

అంతేకాకుండా, ఓలా కస్టమర్‌కు రూ. 6,999 విలువైన బ్యాటరీ-మాత్రమే పొడిగించిన వారంటీని కూడా ఇస్తుంది. ఓలా s1 ఎయిర్ వేరియంట్ ఎకో, స్పోర్ట్స్, రివర్స్ రైడింగ్ వంటి మోడ్‌లు ఉన్నాయి. కేవలం 4.3 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఓలా S1 ఎయిర్‌ అడ్వాన్సడ్ ఫీచర్లతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్ట్ చేయగల 7 అంగుళాల TFT స్క్రీన్, GPS, సైడ్ స్టాండ్ అలర్ట్, మ్యూజిక్ ప్లేబ్యాక్, రిమోట్ బూట్ లాక్/అన్‌లాక్, రివర్స్ మోడ్ వంటి సరికొత్త ఫీచర్లతో వస్తుంది. ఇందులో లిక్విడ్ సిల్వర్‌, కోరల్ గ్లామ్, జెట్ బ్లాక్ వంటి ఇతర కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Read Also : iPhone 13 Discount Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే కొనేసుకోండి.. డోంట్ మిస్..!