Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.. డోంట్ మిస్..!

Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలైంది.. అనేక బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. జూన్ 10 నుంచి మొదలైన ఈ సేల్ జూన్ 14 వరకు కొనసాగుతుంది.

Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.. డోంట్ మిస్..!

Flipkart Big Saving Days Sale starts on June 10

Flipkart Big Saving Days Sale starts on June 10 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) ఈవెంట్‌ మళ్లీ మొదలైంది.. ఈరోజు (జూన్ 10) నుంచి జూన్ 14 వరకు లిమిటెడ్ పిరియడ్ సేల్ కొనసాగుతుంది. ఆపిల్ iPhone 13, Samsung Galaxy F23, Poco X5 వంటి కొన్ని బ్రాండ్ ఫోన్‌లపై డీల్స్, డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తోంది. కొన్ని ఫ్లాట్ డిస్కౌంట్లు, బ్యాంక్ కార్డ్‌లపై, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. అవేంటో ఓసారి లుక్కేయండి.

ఫ్లిప్‌కార్ట్‌లో పోకో X5 5G రూ. 15,999 ధర ఉండగా.. ఇప్పుడు డిస్కౌంట్ ధర రూ. 14,999కి కొనుగోలు చేయవచ్చు. భారత మార్కెట్లో ఈ డివైజ్ రూ. 18,999 ధరతో వచ్చింది. అంటే.. కంపెనీ రూ. 4వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 128GB స్టోరేజ్ మోడల్‌ ధర రూ.58,749కు అందుబాటులో ఉంది.

Read Also : Apple iPhone 11 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 11పై భారీ తగ్గింపు.. కేవలం రూ. 8,950 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో రూ. 69,900కి విక్రయిస్తోంది. ప్రాథమికంగా వినియోగదారులు ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 11,151 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీనిపై ఎలాంటి నిబంధనలు లేదా షరతులు లేవు. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈ 5G ఐఫోన్‌ను రూ. 57,999కి కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే.. ఫ్లిప్‌కార్ట్ ఈ కార్డ్‌పై 10 శాతం డిస్కౌంట్ (రూ. 750) వరకు అందిస్తోంది.

Flipkart Big Saving Days Sale starts on June 10

Flipkart Big Saving Days Sale starts on June 10

ఈ ఏడాది మార్చిలో మార్కెట్లోకి వచ్చిన Samsung Galaxy F23 5G ధర రూ.13,499కి అందుబాటులో ఉంది. వాస్తవానికి ఈ ఫోన్ ధర రూ. 17,499 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ ధర రూ. 6,500 తగ్గింపును పొందవచ్చు. సరసమైన ఫోన్ కోరుకునే వినియోగదారులు Samsung Galaxy F13ని పొందవచ్చు. ఎందుకంటే.. రూ. 10,999కి అందుబాటులో ఉంటుంది. మీరు Samsung Galaxy M14ని కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,327 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో Moto G62 రూ. 14,499 ధరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం రూ.15,499కి కొనుగోలు చేయొచ్చు. ఈ 5G ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది. నథింగ్ ఫోన్ (1), Pixel 6a, iPhone 14, Motorola Edge 40 వంటి ఇతర 5G ఫోన్‌లపై కూడా భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

Read Also : Ola S1 Air Scooter : అత్యంత చౌకైన ఓలా S1 ఎయిర్ స్కూటర్ వచ్చేస్తోంది.. జూలై 1 నుంచే డెలివరీలు.. సింగిల్ 3kwh వేరియంట్ మాత్రమే..!