Apple iPhone 13 Offer _ Buy iPhone 13 huge discount on the price
Apple iPhone 13 Offer : ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ కంపెనీ ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ లైనప్. ఆపిల్ ఐఫోన్‌లలో ప్రమోషన్ డిస్‌ప్లే (ప్రో మోడల్‌లకు పరిమితం) కొన్ని కెమెరా అప్‌గ్రేడ్‌లను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. కుపెర్టినో దిగ్గజం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఐఫోన్ 13 లైనప్‌ను గ్లోబల్ మార్కెట్లోకి అందుబాటులో ఉంచింది. ప్రతి ఏడాది మాదిరిగానే కొత్త ఐఫోన్ ప్రకటనకు ముందు.. ప్రస్తుత సిరీస్‌లో కొంత ధర తగ్గింపు అందిస్తుంది. ప్రస్తుత పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి.. చౌకైన ఐఫోన్ 13 ధరను భారీగా తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 ధర రూ.64,999కి తగ్గింది.
ఐఫోన్ 13 రూ 69,900 వద్ద లాంచ్ అయింది. అంటే.. ఫ్లాగ్‌షిప్ ధర రూ.5వేలకు తగ్గింది. ఐఫోన్ 13 అదే ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో గత సేల్ సమయంలో రూ. 59,999కి అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 mini ఫోన్ కూడా గతంలో రూ. 59,999 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. స్టాక్ క్లియరెన్స్ సీజన్ సమీపిస్తుండటంతో ఐఫోన్ల ధరలు ఆల్ టైమ్ కనిష్టంగా ఉంటాయని అంచనా. ఐఫోన్ 13 కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ 13 కొత్త వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది.
Apple iPhone 13 Offer _ Buy iPhone 13 huge discount on the price
తక్కువ సౌండ్, ప్రకాశవంతమైన ఫొటోలకు 47 శాతం ఎక్కువ కాంతిని అందిస్తుంది. 1.7um సెన్సార్ పిక్సెల్‌లు, f/1.6 ఎపర్చర్‌తో సెన్సార్-షిఫ్ట్ ఆప్టికల్ స్టెబిలైజేషన్‌ను కూడా పొందుతుంది. నైట్ మోడ్ వేగంగా పని చేస్తుందని, పదునైన షాట్‌లను క్యాప్చర్ చేయగలదని కంపెనీ పేర్కొంది. సెటప్‌లో 12MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. ఇందులో ఎపర్చరు f/2.4 ఉంది. కొత్త సినిమాటిక్ వీడియో మోడ్‌ను అందిస్తుంది. ర్యాక్ ఫోకస్‌కు సపోర్టు ఇస్తుంది. తద్వారా మూవింగ్ సబ్జెక్ట్‌లు కూడా ఫోకస్‌లో ఉంటాయి. కెమెరా ఆటోమేటిక్‌గా సబ్జెక్ట్, బ్యాక్‌గ్రౌండ్ మధ్య ఫోకస్‌ని మార్చగలదు.