Apple Iphone 13 Series To Go On Pre Orders From September 17th, Entire Launch Timeline Leaked
Apple iPhone 13 series launch Leak: ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కొత్త ఐఫోన్ 13 సిరీస్ (new iPhone 13 series)ను ఈ 2021 సెప్టెంబర్‌లో లాంచ్ చేయనుంది. అయితే, లాంచింగ్‌కు ముందే టైమ్ లైన్ మొత్తం లీక్ అయింది. ఏయే తేదీల్లో లాంచింగ్ జరుగనుంది.. ఎప్పుటినుంచి ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి.. ఫస్ట్ సేల్ ఎప్పుడు మొదలవుతుంది.. ఆపిల్ నుంచి ఐఫోన్లలో 13 సిరీస్ నుంచి ఎన్నో వేరియంట్లు రాబోతున్నాయి.. ఇలా మొత్తం సమాచారం లీక్ అయింది. ఇప్పటివరకూ ఆపిల్ ఖచ్చితమైన ప్రారంభ తేదీని ఇంకా రివీల్ చేయలేదు.
ఓ నివేదిక ప్రకారం.. ఐఫోన్ 13 సిరీస్ (new iPhone 13 series) ఇప్పటికే చైనాలోని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. దీనికి సంబంధించి లిస్టింగ్ స్క్రీన్ షాట్ మొదట వీబోలో చైనీస్ లీకర్ @పాండల్స్‌బాల్డ్ ద్వారా షేర్ అయింది. ఐఫోన్ 13, 13 ప్రో సిరీస్ మాత్రమే కాదట.. వనిల్లా స్మార్ట్‌ఫోన్ (vanilla smartphone), ప్రో మోడల్, ప్రో మాక్స్ మోడల్ మినీ వేరియంట్‌లతో సహా మొత్తం సిరీస్ లిస్టు లీక్ అయింది.
ఇప్పటివరకూ వచ్చిన రుమర్ల ప్రకారం.. Apple AirPods 3 కూడా పోర్టల్‌లో లిస్టు అయినట్టు కనిపించింది. మొత్తం లాంచ్ టైమ్‌లైన్ ఇలా ఉండనుంది. సెప్టెంబర్ 7 లోపు ఆపిల్ ఇన్విటేషన్ పంపే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 14న ఈ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ కొత్త ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు.. సెప్టెంబర్ 17 నుంచి ప్రీ-ఆర్డర్ ప్రారంభం కానున్నట్టు నివేదిక వెల్లడించింది. మొబైల్ మార్కెట్‌లో సెప్టెంబర్ 24 నుంచి మొదటి సేల్ ప్రారంభం అవుతుందని తెలిపింది. ప్రారంభ తేదీ, సేల్ డేట్ రివీల్ అయ్యాయి. ఈ తేదీలు ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు.
ఏదేమైనా, టిప్‌స్టర్ జోన్ ప్రాసర్ లిస్ట్ చేసిన ఈ తేదీ వాస్తవమేనని, లాంచ్ టైమ్‌లైన్ సరైనదని నివేదిక ధృవీకరించింది. TSMC చిప్‌సెట్ ఉత్పత్తి ఖర్చులను పెంచేయడంతో ఆపిల్ ఐఫోన్‌ల ధరలు కూడా అమాంతం పెరిగినట్టు తెలుస్తోంది. ఆపిల్ రాబోయే ఐఫోన్‌ల ధరలను జనవరి 2022 తరువాత 20శాతం పెంచే అవకాశం ఉందంటూ రుమర్లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి స్ర్కీన్ షాట్ వైరల్ అవుతోంది.