Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 14వేల ఫ్లాట్ డిస్కౌంట్.. అత్యంత సరసమైన ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 15 Sale : ఈ ఐఫోన్ 15 అసలు ధర రూ. 79,900 ఉండగా, 128జీబీ మోడల్‌ ధర కేవలం రూ. 65,000కి పడిపోయింది. అధునాతన ఎ16 బయోనిక్ చిప్, డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను కలిగి ఉంది.

Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 14వేల ఫ్లాట్ డిస్కౌంట్.. అత్యంత సరసమైన ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 15 gets flat discount of Rs 14k: Here are all the details about the offer

Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత సరసమైన ధరకు అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ 15 అసలు ధర రూ. 79,900 ఉండగా, 128జీబీ మోడల్‌ ధర కేవలం రూ. 65,000కి పడిపోయింది. అధునాతన ఎ16 బయోనిక్ చిప్, డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత శక్తివంతమైన ఆప్షన్లలో ఒకటిగా ఉంది. గతంలో ఐఫోన్ 14 ప్రో మోడల్‌లలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఆకట్టుకునే కెమెరా సెటప్ హై-క్వాలిటీ కెమెరా ఫోన్‌ను కోరుకునే వారికి బెస్ట్ ఐఫోన్ అని చెప్పవచ్చు.

Read Also : Apple iPhone 13 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఈ ఐఫోన్ కొనాలా? వద్దా?

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 మోడల్ 128జీబీ స్టోరేజీతో రూ. 65,999 వద్ద లిస్టు అయింది. ఈ ఫోన్ లాంచ్ ధర నుంచి రూ. 13,901 తగ్గింపు పొందింది. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్‌లో మీ పాత ఐఫోన్‌పై రూ. 50వేల వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూను అందిస్తుంది. ఈ డీల్‌ను మరింత ఆకర్షణీయమైనదిగా చెప్పవచ్చు. ఐఫోన్ 15 ప్రత్యేక ఫీచర్లలో ప్రోమోషన్ టెక్నాలజీతో 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో మృదువైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

లేటెస్ట్ ఎ16 బయోనిక్ చిప్ ఫోన్‌కు పవర్ అందిస్తుంది. డిమాండ్ చేసే టాస్క్‌లతో కూడా పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ చిప్, అధునాతన డిస్‌ప్లేతో టాప్ రేంజ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 15 కెమెరా సిస్టమ్ గత వెర్షన్ల కన్నా అప్‌గ్రేడ్‌ వెర్షన్. కొత్త 48ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వస్తుంది. ముఖ్యంగా తక్కువ-కాంతి పరిస్థితుల్లో అద్భుతమైన ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేయొచ్చు.

అల్ట్రా వైడ్, టెలిఫోటో కెమెరాలు కూడా అప్‌గ్రేడ్ అందుకుంటాయి. ఫొటోగ్రఫీలో యూజర్లకు మల్టీఫేస్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. కెమెరా, డిస్‌ప్లేకు మించి ఐఫోన్ 15 లాంగ్ లైఫ్ బ్యాటరీతో ఆకట్టుకుంటుంది. మెరుగైన భద్రతకు అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌, కనెక్టివిటీకి యూఎస్‌బీ-సి పోర్ట్‌ను కలిగి ఉంది.

ఐఫోన్ 15 గత వెర్షన్ల కన్నా ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. టెక్-అవగాహన కలిగిన యూజర్లు, సాధారణ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. అత్యాధునిక ప్రదర్శన, శక్తివంతమైన చిప్, మెరుగైన కెమెరా సిస్టమ్, అదనపు ఫీచర్లతో ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : Yamaha Aerox S Launch : యమహా ఏరోక్స్ ఎస్ మ్యాక్సీ స్కూటర్ చూశారా? ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలుసా?