Apple iPhone: అతి తక్కువ ధర.. రూ.28,205కే ఆపిల్‌ ఐఫోన్‌ 15.. ఇలా కొనండి..

ఆపిల్‌ ఐఫోన్‌ 15పై ఇప్పటికీ ఆసక్తి ఉన్నవారు ఈ తాజా ఆఫర్‌ను వాడుకోవచ్చు.

అమెజాన్‌లో ఆపిల్‌ ఐఫోన్‌ 15ను తక్కువ ధరకు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఈ ఐఫోన్‌ 2023 సెప్టెంబరు 12న విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు అమెజాన్‌లో దీనికి సంబంధించి వివిధ రకాల డిస్కౌంట్లు కనపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు భారీ తగ్గింపు ధరతో కొనే ఛాన్స్‌ వచ్చేసింది.

ఆపిల్‌ ఐఫోన్‌ 15పై ఇప్పటికీ ఆసక్తి ఉన్నవారు ఈ తాజా ఆఫర్‌ను వాడుకోవచ్చు. ఇప్పటికే ఐఫోన్‌ 16 సిరీస్‌ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో అమెజాన్‌ ఐఫోన్‌ 15 (128 జీబీ, బ్లాక్‌ కలర్‌)పై ఈ డిస్కౌంట్‌ అందిస్తోంది.

క్రెడిట్ కార్డ్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ డీల్‌ను పూర్తి స్థాయిలో వాడుకుంటే ఆపిల్‌ ఐఫోన్‌ 15ను మీరు రూ.28,205కే అందుకోవచ్చు. అమెజాన్‌లో ఐఫోన్‌ 15 (128 జీబీ, బ్లాక్‌ కలర్‌) రూ.79,900 ధరతో లిస్ట్‌లో ఉంది. దీనిపై 23 శాతం తగ్గింపును అందిస్తోంది.

Also Read: రానాపై కేసు.. ఫుల్‌ క్లారిటీ ఇచ్చిన ఆయన టీమ్‌

Also Read: ఐపీఎల్‌లో బుమ్రా ఈ మ్యాచుల్లో ఆడడా? కోచ్ జయవర్దనే ఏమన్నారంటే?

దీంతో దాని ధర రూ. 61,900 అవుతుంది. ఇంకా ఎక్కువ డిస్కౌంట్‌ కోసం అమెజాన్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్‌ను వాడుకోవాలి. ఐఫోన్‌ 14 ప్లస్ (512 జీబీ)ని మార్పిడి చేసుకుంటే రూ.30,600 తగ్గింపు వస్తుంది. దీంతో ఐఫోన్‌ 15 ధర రూ.31,300కి తగ్గుతుంది.

అదనంగా, అమెజిన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ.3,095 తగ్గింపును అందుకోవచ్చు. దీంతో ఫైనల్‌ రేట్ రూ. 28,205కి తగ్గుతుంది.

ఐఫోన్‌ 15.. 6.1-అంగుళాల డిస్‌ప్లేతో పింక్, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో లభిస్తుంది. ఈ ఐఫోన్లలో సాంప్రదాయ నాచ్‌కు బదులుగా డైనమిక్ ఐలాండ్ నాచ్‌ను ఆపిల్‌ అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ మోడల్ 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వచ్చింది. ఆపిల్ ఏ16 బయోనిక్ చిప్ తో ఇది పనిచేస్తుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌లలో ఉపయోగించిన ఏ15 చిప్ నుంచి దీన్ని అప్‌గ్రేడ్ చేశారు.