IPL 2025: ఐపీఎల్‌లో బుమ్రా ఈ మ్యాచుల్లో ఆడడా? కోచ్ జయవర్దనే ఏమన్నారంటే?

కొన్ని వారాల క్రితం బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో బుమ్రాకి గాయాలైన విషయం తెలిసిందే.

IPL 2025: ఐపీఎల్‌లో బుమ్రా ఈ మ్యాచుల్లో ఆడడా? కోచ్ జయవర్దనే ఏమన్నారంటే?

Jasprit Bumrah

Updated On : March 19, 2025 / 8:57 PM IST

ఐపీఎల్‌ మ్యాచులు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23న చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, ముంబయి ఇండియన్స్‌ కీలక బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఇంకా గాయం నుంచి కోలుకోలేదు.

కొన్ని వారాల క్రితం బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో బుమ్రాకి గాయాలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ బుమ్రా ఆడలేదు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్నాడు. ఐపీఎల్‌లో బుమ్రా కొన్ని మ్యాచులకు దూరమయ్యే ఛాన్స్ ఉంది.

Also Read: ఇలాగైతే పరుగుల వరద.. ఈ ఐపీఎల్‌లో స్కోరు 300 దాటిపోతుంది: ఏబీ డివిలియర్స్‌

దీనిపై ముంబై జట్టుకు ఇది అతిపెద్ద చాలెంజ్‌ అని ఆ జట్టు కోచ్‌ జయవర్దనే అన్నారు. ప్రస్తుతం బుమ్రా కోలుకుంటున్నాడని చెప్పారు. టీమ్‌లో బుమ్రా త్వరలోనే జాయిన్‌ అవుతాడని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే బెస్ట్‌ బౌలర్లలో బుమ్రా ఒకడని అన్నారు.

బుమ్రా ప్రస్తుతం టీమ్‌కు అందుబాటులో లేకపోవడం సవాలైనప్పటికీ, ఈ ఛాన్స్‌ను ముంబై జట్టులో మరో బౌలర్‌ అందిపుచ్చుకోవాలని చెప్పారు. తాము కాస్త వెరైటీగా ప్రయత్నించేందుకు సైతం ఇదో ఛాన్స్‌ అని తెలిపారు.

బుమ్రా కొన్ని మ్యాచ్‌లు మిస్‌ అయ్యే ఛాన్స్‌ ఉండడంతో అతడి స్థానంలో ఎవరు ఆ ఛాన్స్ వాడుకుంటారో చూడాలని జయవర్ధనే అన్నారు. తాము బుమ్రా కోసం వేచి ఉండాల్సి ఉంటుందని చెప్పారు. ఐపీఎల్‌ 2025 ప్రారంభంలో జట్టులో కొన్ని మార్పులు ఉంటాయన్నారు.