Apple iPhone 15 Pro gets a big discount on Vijay Sales
iPhone 15 Pro Discount : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? విజయ్ సేల్స్ ఐఫోన్ 15 ప్రోపై భారీ డిస్కౌంట్ ఆఫర్‌తో అందిస్తోంది. భారత మార్కెట్లో లభించే అతి తక్కువ ధర ఐఫోన్ 15 ప్రోగా నిలిచింది. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై రూ. 30,410 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా ఐఫోన్ 15 ధర రూ. 1,04,490కి తగ్గింది. అసలు ఐఫోన్ ప్రారంభ ధర రూ. 1,34,900 నుంచి భారీగా తగ్గింది. ముఖ్యంగా, ఈ డీల్ ఐఫోన్ 15 ప్రో 128జీబీ స్టోరేజ్ మోడల్‌కు వర్తిస్తుంది. ఈ ఐఫోన్ మొత్తం వైట్, బ్లాక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
ఈ ఫ్లాట్ డిస్కౌంట్‌పై ఎలాంటి నిబంధనలు లేదా షరతులు లేవని గమనించాలి. పోటీ ధరతో హైఎండ్ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే ఎవరికైనా ఆకర్షణీయమైన ఆఫర్‌గా చెప్పవచ్చు. ఆపిల్ 2024 మోడల్స్ ధరలను తగ్గించగా.. ఐఫోన్ 15 ప్రోపై విజయ్ సేల్స్ డీల్ అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. ఫ్లాట్ డిస్కౌంట్లతో పాటు విజయ్ సేల్స్ బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది.
ఐఫోన్ కొనుగోలుదారులు డబ్బులను మరింత ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుత ఐఫోన్‌లను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే.. ఐఫోన్ 15 ప్రోని మరింత తక్కువ ధరకు పొందవచ్చు. ఈ అదనపు ఆఫర్లు, ఫ్లాట్ డిస్కౌంట్లతో ఐఫోన్ ప్రస్తుత మార్కెట్‌లో అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది. కొత్త ఐఫోన్ 16 ప్రోతో పోల్చితే.. ఐఫోన్ 15 ప్రో ఇప్పటికీ బెస్ట్ ఫోన్ అనొచ్చు.
ఈ రెండు మోడల్‌ల మధ్య ధర వ్యత్యాసం రూ. 15,410 ఉంటుంది. ఐఫోన్ 16 ప్రో భారత మార్కెట్లో రూ. 1,19,900 నుంచి అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 ప్రోలో అల్ట్రా-వైడ్ కెమెరా, పవర్‌ఫుల్ చిప్, స్పేషియల్ ఆడియో క్యాప్చర్ వంటి అడ్వాన్స్‌డ్ ఆడియో ఫీచర్లు ఉన్నాయి. కానీ, ఐఫోన్ 15 ప్రో ఇప్పటికీ టాప్-టైర్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
ఐఫోన్ యూజర్లకు ఐఫోన్ 15ప్రో బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది. నాలుగు ఏళ్లకు పైగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు కూడా పొందవచ్చు. అదనంగా, ఐఫోన్ 15 ప్రో పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో లేటెస్ట్ కెమెరా లేదా ఆడియో అప్‌గ్రేడ్ అవసరం లేని వారికి బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు.