iPhone 15 Discount : రూ. 25 వేల కన్నా తక్కువ ధరకే ఐఫోన్ 15 కొనేసుకోవచ్చు.. ఈ బంపర్ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు..!

iPhone 15 Discount : ఆసక్తిగల కొనుగోలుదారులు ఐఫోన్ 15 మోడల్ రూ.25 వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇంతకీ ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

iPhone 15 Discount : రూ. 25 వేల కన్నా తక్కువ ధరకే ఐఫోన్ 15 కొనేసుకోవచ్చు.. ఈ బంపర్ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు..!

Apple iPhone 15 selling Massive discount

Updated On : December 29, 2024 / 3:54 PM IST

iPhone 15 Discount : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 15 కొనేందుకు ఇదే సరైన అవకాశం. ఐఫోన్ 15 ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాదు. కానీ, మీరు ఈ ఐఫోన్ 15 తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు.

Read Also : iPhone 16 Discount : కొత్త ఐఫోన్ కావాలా? ఆపిల్ ఐఫోన్ 16పై బిగ్ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

ప్రస్తుతం, ఈ ఐఫోన్ 15 ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఐఫోన్ 15 మోడల్ రూ.25 వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇంతకీ ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్ 15పై డిస్కౌంట్ :
ఐఫోన్ 15 (బ్లాక్, 128జీబీ ) మునుపటి ధర రూ. 69,900గా ఉంది. కానీ, ఈ ఐఫోన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో 14శాతం తగ్గింపు తర్వాత ఎలాంటి బ్యాంక్ డిస్కౌంట్ లేకుండా రూ. 59,999కి అందుబాటులో ఉంది. ఇది కాకుండా, ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కారణంగా ఫోన్ ధర మరింత తగ్గుతుంది.

ఐఫోన్ 15 బంపర్ ఆఫర్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ధర రూ. 59,999కు పొందవచ్చు. అయితే, మీ పాత ఐఫోన్ 14ని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. రూ. 35,500 తగ్గింపును పొందవచ్చు. ఈ విధంగా ఐఫోన్ ధర రూ.24,499 మాత్రమే అవుతుంది. అయితే, ఎక్స్ఛేంజ్ చేసిన ఫోన్ వాల్యూ డివైజ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు ఐఫోన్ వివరాలను రిజిస్టర్ చేయడం ద్వారా వాల్యూను చెక్ చేయాలి. దాంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించే కస్టమర్‌లకు రూ.1,000 తగ్గింపు కూడా పొందవచ్చు. మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ.23,499కి కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్‌లు :
ఆపిల్ ఐఫోన్ 15 డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీతో వస్తుంది. మీరు ఐఫోన్‌ని ఉపయోగించే విధానాన్ని మారుస్తుంది. 6.1 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. 2000 నిట్‌ల వరకు ప్రకాశాన్ని ఇస్తుంది. చాలా స్పష్టమైన ఫొటోలను చూడొచ్చు. ఈ ఐఫోన్ అత్యంత స్పెషల్ ఫీచర్ 48ఎంపీ ప్రైమరీ కెమెరా, క్వాడ్-పిక్సెల్ సెన్సార్, 100శాతం ఫోకస్ పిక్సెల్‌లను కలిగి ఉంది. దీని కారణంగా ఫోటోలు చాలా త్వరగా ఫోకస్ అవుతాయి.

Read Also : iPhone 16 Pro Discount : ఆపిల్ ఐఫోన్ 16 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఇదే బెస్ట్ ఛాన్స్.. డోంట్ మిస్!