Apple iPhone 16 Plus : వారెవ్వా.. ఇది కదా డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ఇంత తక్కువా? ఎంత తగ్గిందంటే?

Apple iPhone 16 Plus : ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ సరసమైన ధరకే లభిస్తోంది. విజయ్ సేల్స్ ద్వారా ఈ ఐఫోన్ మోడల్ కొనుగోలుపై ఏకంగా రూ. 21వేలు తగ్గింపుతో లభిస్తోంది.

Apple iPhone 16 Plus

  • భారత్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900 మాత్రమే
  • విజయ్ సేల్స్ లో ఈ ఐఫోన్ ప్రస్తుతం రూ.71,890కి లిస్టింగ్
  • HDFC క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ. 3,500 అదనపు తగ్గింపు

Apple iPhone 16 Plus : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మీరు పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఐఫోన్ 16 ప్లస్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఆపిల్ లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ. 21వేల కన్నా ఎక్కువ తగ్గింపుతో లభిస్తోంది.

ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. సాధారణంగా లిమిటెడ్ టైమ్ వరకు అందుబాటులో ఉంటాయి. మీరు ఐఫోన్ 16 ప్లస్ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. ఇంతకీ ఈ అద్భుతమైన ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం..

ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ రూ. 89,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అయితే, విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 71,890కు లిస్ట్ అయింది. రూ. 18,010 ఫ్లాట్ డిస్కౌంట్‌ అందిస్తోంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ. 3,500 తగ్గింపుతో కొనేసుకోవచ్చు.

Read Also : Income Tax Rules 2026 : జీతగాళ్లకు జాక్‌పాట్.. కొత్త ఆదాయపు పన్నుతో చేతికి ఎక్కువ జీతం? పూర్తి లెక్కలివే..!

ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ A18 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల ఫుల్ సూట్‌కు సపోర్టు ఇస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 48MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఐఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాతో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్ కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సింగిల్ ఛార్జ్‌పై 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ అందిస్తుందని ఆపిల్ పేర్కొంది.