Apple iPhone 16 Pro Max
Apple iPhone 16 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ చౌకైన ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ కొద్ది రోజులు మాత్రమే.. మీ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఇదే బెస్ట్ టైమ్. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఐఫోన్ 16 ప్రో మాక్స్‌ను బ్యాంక్ ఆఫర్‌లతో పాటు రూ. 10వేల కన్నా ఎక్కువ భారీ తగ్గింపుతో అందిస్తోంది.
అయితే, ఇలాంటి భారీ ధరల తగ్గింపు అనేది సాధారణంగా ఎక్కువ రోజులు ఉండవు. ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లో ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్, A18 ప్రో చిప్, 6.3-అంగుళాల డిస్‌ప్లే ఆప్షన్లు ఉన్నాయి. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర ఎంతంటే? :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ కేవలం రూ.1,34,900 తగ్గింపు ధరకు లభిస్తోంది. అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌తో కస్టమర్లు రూ.4వేల వరకు అదనపు బ్యాంక్ డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు. అదనంగా, ఈ-కామర్స్ బ్రాండ్ నెలకు రూ.4,743 నుంచి ప్రారంభమయ్యే కొనుగోలుదారులకు ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది.
అయితే, మీరు బ్యాంక్ నిబంధనలు, షరతులను బట్టి ఫైల్ ఛార్జీలు, ఇతర వడ్డీని చెల్లించాల్సి రావచ్చు. మీరు మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. రూ. 57,400 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, కచ్చితమైన తగ్గింపు మీ ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ OLED డిస్‌ప్లేతో వస్తుంది. 2,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందుకోగలదు. అదనంగా, హుడ్ కింద ఆపిల్ 3nm A18ప్రో ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.
ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్టు ఇచ్చేందుకు ఈ ఫోన్ 8GB ర్యామ్ కూడా కలిగి ఉంది. ఆప్టిక్స్ పరంగా, ఈ ఐఫోన్ 48MP మెయిన్, 48MP అల్ట్రావైడ్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 12MP టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ అందిస్తుంది. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరాను పొందవచ్చు.